
ఇక ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అనే మూవీ చేస్తున్న విషయం తెల్సిందే. ప్రఖ్యాత నిర్మాత ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మొదటి నుండి ఈ ప్రతిష్టాత్మక పీరియాడికల్ మూవీ పై పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా బాగానే అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ అనంతరం గతంలో తనతో గబ్బర్ సింగ్ మూవీ తీసిన హరీష్ శంకర్ తో, భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీ చేయనున్నారు పవన్ కళ్యాణ్, ఆపైన సముద్రఖని తో అలానే సురేందర్ రెడ్డి తో కూడా పవన్ పనిచేయనున్నారు.
అయితే ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో కూడా దూసుకెళ్తుండడంతో ఆయన ఈ రెండు సినిమాలు ఇప్పట్లో చేసే ఛాన్స్ లేదని కొన్ని మీడియా మాధ్యమాల్లో కొద్దిరోజులుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. దీనితో ఒకింత పవన్ ఫ్యాన్స్ ఢీలా పడ్డారు. అయితే లేటెస్ట్ గా ఆయన సన్నిహిత వర్గం నుండి అందుతున్న న్యూస్ ప్రకారం త్వరలోనే ఈ రెండు సినిమాలు కూడా పవన్ ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తి చేస్తారని, ఆపైన ఇక పూర్తిగా ఆయన రాజకీయాలవైపు కొనసాగే అవకాశం ఉన్నట్లు టాక్. కాగా ఇదే కనుక నిజం అయితే పవన్ ఫ్యాన్స్ కి ఇది సూపర్ గుడ్ న్యూస్ అంటున్నారు విశ్లేషకులు.