జబర్దస్త్  కార్యక్రమం ద్వారా ఎంతో  మంచి పేరు ప్రఖ్యాతలు   సంపాదించుకున్నారు సుడిగాలి సుదీర్. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఈయన ఎంతో గుర్తింపు సంపాదించుకున్న అనంతరం బుల్లితెరపై ఇతర కార్యక్రమాలలో కూడా  తెగ సందడి చేస్తూ ఎంతో బిజీగా మారారు.

అయితే ఈ కార్యక్రమాలన్నీ కూడా మల్లెమాలవారి కార్యక్రమాలు కావడం విశేషం మరి . ఇకపోతే సుదీర్ఘ ప్రయాణం తర్వాత సుధీర్ ఒక్కసారిగా మల్లెమాల వారి కార్యక్రమాలను వదిలి పెట్టి, స్టార్ మా లోకి షిఫ్ట్ అయ్యారు అంట మరి . సుధీర్ మల్లెమాల వారి కార్యక్రమాలను వదిలి రావడానికి గల సరైన కారణం తెలియకపోయినప్పటికీ ఈయన ఈ టీవీకి పూర్తిగా దూరమయ్యారు అని చెప్పవచ్చు

ఇకపోతే ఈటీవీ వదిలిన సుధీర్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ అనే సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమానికి అనసూయతో కలిసి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.అయితే ఈ కార్యక్రమం కొద్దిరోజుల పాటు ప్రసారమైనప్పటికీ తరువాత సుధీర్ ఏ ఇతర ఛానల్లోనూ కనిపించకపోవడంతో అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఒకానొక సమయంలో సుధీర్ జబర్దస్త్ వదిలి వచ్చి  పెద్దా తప్పు చేశారా అనే భావన కూడా అభిమానులలో కలిగింది. ఈ విధంగా బుల్లితెరపై కనుమరుగైన సుధీర్ ఓటీటిలో ప్రత్యక్షమయ్యారు.

ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా వేదికగా కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ కార్యక్రమం మొదలు పెట్టబోతున్నామంటూ సుధీర్ కు ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమంలో భాగంగా సుడిగాలి సుదీర్ తో పాటు యాదమ్మ రాజు, హరి ముక్కు అవినాష్ వంటి తదితరులు పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమో కూడా సోషల్ మీడియాలో  బాగా వైరల్ గా మారింది.ఏది ఏమైనా బుల్లితెరకు దూరమైనటువంటి సుధీర్ ఇలా ఆహాలో ప్రత్యక్షం కావడంతో అభిమానుల కు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: