అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపే పూరీజగన్నాథ్ జీవితంలో మరొక కోణం ఉంది. అతడి మాటలలో ఆలోచనలలో చాల వేదాంతం కనిపిస్తుంది. ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో పూరీ తన వీడియోల ద్వారా చెప్పే విషయాలను ఎందరో ఆశక్తిగా వింటూ ఉంటారు. చిరంజీవి లాంటి టాప్ హీరో కూడ తాను ఖాళీగా ఉన్నప్పుడు పూరీ మ్యూజింగ్స్ వింటాను అని ఓపెన్ గా చెప్పాడు అంటే పూరీ మాటలలో ఎంత లోతైన అర్థాలు ఉన్నాయో అర్థం అవుతుంది.


‘లైగర్’ మూవీ నిర్మాణంలో బిజీగా ఉన్నప్పుడు పూరీ తన మ్యూజింగ్స్ వీడియోలను తగ్గించివేసాడు. ఇప్పుడు ‘లైగర్’ పరాజయం తరువాత ప్రస్తుతం ఖాళీగా ఉంటూ ఉండటంతో పూరీ తన మ్యూజింగ్స్ ను మళ్ళీ మొదలుపెట్టాడు. లేటెస్ట్ గా పూరీ ‘గుడ్ సిటిజన్’ అనే వెరైటీ కాన్సెప్ట్‌ తో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమాజంలో బాధ్యతాయుతంగా మెలుగుతూ మంచి పనులు చేసే వారిని అందరికీ సాయపడేవారిని ప్రభుత్వాలు గుర్తించి వారికి ‘గుడ్ సిటిజన్’ కార్డులు ఇవ్వాలని పూరీ పిలుపు ఇచ్చాడు.



ఇలాంటి పద్ధతి సింగపూర్ లో అమలు అవుతోంది అన్న విషయాన్ని కూడ తెలియచేసాడు. ఇలా గుడ్ సిటిజన్ కార్డులు పొందిన వారికి బస్సులు రైళ్లలో రాయితీలు పన్ను మినహాయింపులు అలాగే వారి పిల్లలకు విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కలిపిస్తే దేశంలో గుడ్ సిటిజన్ సంఖ్య నెమ్మది నెమ్మదిగా పెరిగి ఆవిధానం దేశానికి ఎంతో మేలు చేస్తుంది అంటూ పూరీ తన అభిప్రాయాన్ని తెలియచేసాడు.


పూరీ ఇచ్చిన ఆలోచన పై ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో రాజకీయ పార్టీలు నాయకులు ప్రజలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే పరిగణిస్తున్న పరిస్థితులలో ప్రజలు నిజంగా పూరీ చెప్పిన విధంగా గుడ్ సిటిజన్స్ గా మారిపోతే డబ్బు తీసుకుని సభలకు వచ్చి ఓట్లు వేసేవారు లేకపోతే దేశరాజకీయాలలో ఎన్నో మార్పులు వచ్చే ఆస్కారం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: