బాలీవుడ్ స్టార్ హీరో కింగ్ ఖాన్ బాద్షా షారుఖ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పఠాన్. షారుక్ ఖాన్ రీ ఎంట్రీ కోసం ఆయన అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.పఠాన్ ఈనెల రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఈ మూవీలో షారుక్ సరసన దీపికా పదుకునే హీరోయిన్ గా నటించింది. ఈ హాట్ బ్యూటీ బికినీతో కనిపించిన ఓ పాట ఒకటి గత కొన్ని రోజులుగా వివాదాస్పదం అవుతోంది. అయినా కానీ మూవీపై అంచనాలు తగ్గట్లేదు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత షారుక్ ఖాన్ వస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా పఠాన్ మూవీ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కాసేపటి క్రితమే విడుదలైన ఈ మూవీ టీజర్, పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో పాటు కొన్ని వివాదాలకు కూడా తెరలేపాయి. 


తాజాగా విడుదలైన పఠాన్ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఇదొక కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని సమాచారం తెలుస్తోంది.ఇక ఈ మూవీలో మరో స్టార్ హీరో జాన్ అబ్రహం కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీలో యాక్షన్స్ సీన్స్ చాలా హైలైట్ గా ఉండనున్నాయని తెలుస్తోంది . శత్రువులనుంచి దేశాన్ని కాపాడే పాత్రలో షారుక్ ఖాన్ కనిపించనున్నాడు. దేశాన్ని నాశనం చేయడానికి ఓ గ్రూప్ డబ్బులు తీసుకొని ఇండియా మీద భారీగా దాడి ప్లాన్ చేస్తుంది. ఆ పనిని జాన్ అబ్రహం తీసుకుంటాడు. దాంతో ఇండియా అధికారులు ఒక పాత ఆఫీసర్ అయిన పఠాన్(షారుఖ్) ని రంగంలోకి రప్పిస్తారు.ఇక పఠాన్ కి తోడుగా దీపికా కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొంటుంది.తరువాత వీరు ఇద్దరు కలిసి దేశాన్ని ఎలా కాపాడారు అనేది ఈ సినిమా కథ. పఠాన్ పాన్ సినిమా పెద్ద ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్ ను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: