
ఈ సినిమా డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ను కూడా భారీ ధరకే అమ్ముడుపోయినట్లుగా వార్త వినిపిస్తున్నాయి. శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవీ సొంతం చేసుకోగా డిజిటల్ స్ట్రిమింగ్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. భారీ మొత్తంలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అటు తమిళనాడు కూడా ఈ సినిమా థియేటర్ రైట్స్ సెవెన్ స్క్రీన్ స్టూడియో వారు భారీ ధరకే తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టం వల్ల ప్రతి పేదవాడి చదువు కూడా దూరం అవుతోందని కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది.
ఈ సినిమా ప్రమోషన్స్ అంతగా చేసినట్లు కనిపించకపోయిన కానీ బజ్ మాత్రం బాగానే క్రియేట్ అయింది. ఈ సినిమాకు ఒక్క రోజు వందే ప్రీమియం వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా థియేటర్లలో విడుదల సొంతం చేసుకున్నది. సినిమాకు ప్రాణమైన కథ సార్ మూవీలో ఊహలకు అందనీ ట్విస్టులు ఉన్నట్లుగా రివ్యూలలో తెలియజేయడం జరిగింది. అయితే సార్ మూవీ ఫస్ట్ అఫ్ పరవాలేదు అనిపించుకుందని సెకండాఫ్ యావరేజ్ గా ఉందని కొంతమంది తెలియజేస్తున్నారు. ఎట్టకేలకు సార్ మూవీతో మంచి విజయాన్ని మాత్రం ధనుష్ అందుకున్నారు. ఇక ఈ మధ్యకాలంలో విడుదలైన సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు దీంతో సార్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం ప్లస్ అయ్యింది.