తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ హీరోలలో నాగ శౌర్య ఒకరు. ఈ యువ నటుడు ఇప్పటికే ఎన్నో సినిమా లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ నాగ శౌర్య ఛలో మూవీ తో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 

మూవీ ద్వారానే రష్మిక తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఛలో మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ యువ హీరో ఆ తర్వాత చిన్న చేతకా విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నప్పటికీ ఛలో రేంజ్ విజయాన్ని మాత్రం ఇప్పటి వరకు అందుకోలేకపోయాడు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో వరుసగా ఈ యువ నటుడు వరుడు కావలెను , లక్ష్య ,  కృష్ణ  వ్రిందా విహారి అనే మూవీ లలో నటించాడు. పరవాలేదు అనే రేంజ్ అంచనాల నడుము విడుదల అయిన ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయాయి.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ హీరో "రంగబలి" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ ని జూలై 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: