తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన హీరోలలో శివ కార్తికేయన్ ఒకరు. ఈ నటుడు ఇప్పటికే తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక సూపర్ క్రేజ్ ను ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ నటుడు తమిళ సినిమా ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా తాను నటించిన ఎన్నో సినిమాలను టాలీవుడ్ లో కూడా విడుదల చేసి అందులో కొన్ని మూవీ లతో తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్భుతమైన విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. 

ఇది ఇలా ఉంటే శివ కార్తికేయన్ ఆఖరుగా నటించినటువంటి వరుణ్ డాక్టర్ , కాలేజ్ డాన్ , ప్రిన్స్ మూవీ లు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి కలక్షన్ లను వసూలు చేశాయి. ఈ మూడు మూవీ ల ద్వారా శివ కార్తికేయన్ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరింతగా పెరిగి పోయింది. దానితో ఈ నటుడు ప్రస్తుతం నటిస్తున్న మూవీ ని కూడా తెలుగు లో విడుదల చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ నటుడు మా వీరన్ అనే తమిళ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. మడోనే అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.  

మూవీ ని జులై 14 వ తేదీన తమిళ , తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు. తమిళ్ లో ఈ సినిమాను మా వీరన్ పేరుతో విడుదల చేయనుండగా ... తెలుగు లో ఈ సినిమాను మహాcవీరుడు పేరుతో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క తెలుగు హక్కులను ఏషియన్ సినిమా సంస్థ దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sk