ధనుష్ నటించిన తాజా మూవీ కుబేర.. ఈ సినిమా జూన్ 20న విడుదల కాబతుండడంతో తాజాగా ఈ సినిమాకు సంబంధించి హైదరాబాదులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ధనుష్ మాట్లాడుతూ.. నాకు చాలామంది సన్నిహితులు సలహాలు ఇచ్చారు. యాక్షన్ సినిమా చెయ్యి అందరికీ గుర్తుండిపోయే సినిమా చెయ్ అని చెప్పారు. కానీ ఎవరి సలహా తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్లో మునిగిపోయాను. అలా హాలీవుడ్లో ది గ్రే మ్యాన్ షూటింగ్ జరుగుతున్న టైంలో నాకు కుబేర మూవీ కి సంబంధించి స్టోరీ చెప్పారు. అలా దాదాపు 20 నిమిషాలు వీడియో కాల్ లో మాట్లాడే ఈ కథ చెప్పారు. ఇక కథ నచ్చడంతో నేను కూడా ఓకే చెప్పాను. ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు స్టోరీ స్క్రిప్ట్ వర్క్ రెడీ చేశారు. 

కథ నచ్చడంతో మరోసారి నాకు స్టోరీ వివరంగా చెప్పారు. అయితే అప్పటికి నాకు శేఖర్ కమ్ముల అంటే ఎవరో కూడా తెలియదు.దాంతో చాలామంది శేఖర్ కమ్ములతో సినిమా చేస్తున్నాను అని చెప్పడంతోనే వాళ్ళందరూ ఓహో భలే డైరెక్టర్ ని పట్టావు.. ఆయన ది బెస్ట్ డైరెక్టర్ అంటూ చాలామంది చాలా రకాల మాటలు మాట్లాడారు. ఆయన గురించి బిల్డప్పులు ఇచ్చారు. కానీ తీరా కుబేర మూవీ షూటింగ్లో పాల్గొన్నాక నన్ను రోడ్డుమీద బిచ్చమెత్తుకునేలా చేశాడు.. నమ్మినందుకు నన్ను రోడ్డుమీద బిచ్చం ఎత్తుకునేలా మార్చేశాడు.. తిరుపతి రోడ్లమీద అమ్మా అమ్మా అంటూ బిచ్చం ఎత్తుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది అంటూ ధనుష్ కుబేర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా సరదాగా నవ్వుకుంటూ శేఖర్ కమ్ముల గురించి చెప్పుకొచ్చారు.

అయితే కుబేర సినిమాలో ధనుష్ బిచ్చగాడి పాత్రలో కనిపించిన సంగతి మనకు తెలిసిందే. అందుకే సరదాగా ధనుష్ శేఖర్ కమ్ముల గురించి ఈ మాటలు మాట్లాడారు. ఇక ఎలాంటి హింసాత్మక సన్నివేశాలను చిత్రీకరించని వైలెన్స్ చూపించని డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల కూడా ఒకరు. ఈయన సినిమాలు చాలా రియలిస్టిక్ గా ఉంటాయి.చాలా రోజుల నుండి శేఖర్ కమ్ముల నుండి సినిమాలు రావడం లేదు. ఇక ప్రస్తుతం రాబోతున్న కుబేర సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కూడా కీ రోల్ పోషిస్తున్నారు. కాబట్టి సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మరి చూడాలి ఈ సినిమా రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: