ప్రజాస్వామ్య దేశంలో రాజరికం రాజ్యమేలుతుంది. వారసత్వ రాజకీయాలు క్రమంగా పెరుగుతున్నాయి. భారతదేశవంలో ఏ రాజకీయ పార్టీ చూసినా కుటుంబపాలనే కనిపిస్తుంది. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, సమాజవాది, జేడీఎస్ లో పోటాపోటీగా తండ్రులు తనయులను ఎన్నికల్లో నిలబెడుతున్నారు. ఏదో ఒక విధంగా టికెట్లు ఇప్పించుకుని గెలిపించుకుంటున్నారు.

ఒకప్పుడు రాజకీయాల్లోకి వచ్చే వారందరూ ఏమి ఆశించకుండా నిస్వార్థంగా ప్రజా సేవ చేసేవారు. కానీ, ఇప్పుడు అందుకు భిన్నంగా సంపాదన, అధికారం ధ్యేయంగా రాజకీయాల్లోకి వస్తున్నారు. దీంతో రాజకీయాలు పూర్తిగా కలుషితమైనాయి. మరో విధంగా చెప్పాలంటే రాజకీయాలు పూర్తిగా బ్రష్టుపట్టి దిగజారి పోతున్నాయి. రాజకీయాలను అడ్డుపెట్టుకుని ఏదో ఒక విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు అర్జిస్తున్నారు. నేతల చేష్టలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

రాజకీయ విలువల పతనమై ఆర్థిక సంబంధాల చుట్టు తిరుగుతున్నాయి. రక్త సంబంధ రాజకీయాలు చదరంగంగా మారాయి. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలలో రక్త సంబంధ రాజకీయాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రి జవహార్ లాల్ నెహ్రూ నుంచి గాంధీ కుటుంబం ఇప్పటి వరకు పరిపాలనలో కొనసాగుతున్నది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు భారత ప్రధానులుగా పని చేశారు. ఇందిరా గాంధీ కోడలయిన సోనియా గాంధీ యూపీఏ చైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు.

సోనియా గాంధీ ఇటలీ దేశానికి చెందినది కాబట్టి ప్రధానిగా ఉండటానికి బీజేపీతో పాటు పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించడంతో సోనియా సూచించిన మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రిగా నియమించారు. సోనియా గాంధీ కుమారుడైన రాహూల్ గాంధీ ఆమేథీ నుంచి ఎంపీగా రెండు పర్యాయాలుగా గెలుపొందారు. ఏఐసీసీ ఉపాధ్యక్షులుగా ఇటీవల నియమితులయ్యారు. ఇందిరా గాంధీ మరో కోడలైన మేనకా గాంధీ కొడుకు వరుణ్ గాంధీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. దివంగత రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్,  బార్య విజయలక్ష్మి కూడా వైకాపా స్థాపించి వారసత్వంగా కొనసాగుతున్నారు. కాగా తెలుగుదేశంపార్టీలో ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు, పురందేశ్వరి, లోకేష్, బాలక్రిష్ణ, హరికృష్ణ తదితరులు వారసత్వంగా వచ్చినవారే. టిఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందడుగు వేసి టిఆర్ఎస్ ను కుటుంబపార్టీగా మార్చింది. కెసిఆర్, కవిత, కెటిఆర్, హరీష్ రావుతో పాటు తెరవెనుక ఎంతో మంది లెక్కకు రాని వారున్నారు. దీంతో పాటు తెలంగాణ ప్రాంతంలోని వెలమ వర్గం రావులకు ఇప్పుడు ఇంటిపార్టీగా మారింది. టిఆర్ఎస్ అంటే “తెలంగాణ రావుల సమితి”గా కూడా అంటుంటారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: