మనిషి అంతరాంతరాల్లో అనవరతం పొడచూపేది అహంకారం. "ఎవరేది చెప్పినా నాకు తెలియదా? నాకొకరు చెప్పడమేమిటి? అనే ఒకరకమైన దుగ్ధ, తీట ప్రతీ ఒక్కరిలో అన్ర్లీనంగా ఉంటూ ఎప్పుడో ఒకప్పుడైనా బయట పడుతుంది. అయితే దాన్ని బయట పడకుండా నియంత్రించే గొప్ప గుణాలు అణకువ, వినయం, ఇంకా తాము గొప్పవారిమనే భావన మనసులో రానీయక పోవటం. ఇవి మనుషులను ఉత్తములుగా తీర్చిదిద్దే అవసరమైన లక్షణాలు. అలవరచుకుంటే సాధించుకోగల సాధనాలు కూడా!

 

విద్య, ఐశ్వర్యం, అందం, అధికారం - ఇవే సాధారణంగా మనుషుల్లో అహంకారం పెంచే అంశాలు. ఉన్నతులనైనా అధమానికి దిగజార్చే దుర్గుణం అహంకారం. అన్నింటా ఉన్నత స్థానంలో ఉన్నవారెవరికైనా వారు అత్యున్నతంగా రాణించాలంటే ముందుగా వారిలో ఉండాల్సిన సుగుణం అణకువ. 

 

మనుషుల మధ్య ఎక్కువగా మనస్పర్థలు, జగడాలు తలెత్తటానికి ప్రధాన కారణం అహంకారమే. ఈ అహంకారానికి వయస్సు, ధన, కుల, మత, ప్రాంత, లింగ, భాష- లకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం మనిషైతే చాలు, వారి మనసంతా వ్యాప్తమై వుంటుంది. తగిన తగని సంధర్భం ఏదైనా ఈ అహంకారం బ్రద్ధలై సంభంధాల్లో సునామిలా విస్పోఠనం సృష్టిస్తుంది. 

 

ఆ సునామి తీరం దాటి జరిగిన విలయం చల్లబడ్డాక ఇలా ఎందుకు జరిగింది? అయ్యో! ఇలా జరిగి ఉండకూడదే! అని మనిషి మరల తనలో తాను మదనపడటం కూడా జరిగిపోతూ ఉంటుంది. ఈ కన్నూ మిన్నూ కానని అహంకారం దేహమంతా వ్యాపించి తలకెక్కితే తన చుట్టూ వాతావరణాన్ని మానసికంగా భౌతికంగా అతలాకుతలం చేసి నడినెత్తిన నాట్యంచేసే గుణం ఈ అహంకారం స్వంతం. అహంకారానికి స్వార్ధం తోడైనప్పుడు ఒక రకమైన అంధకారం మనసును కమ్మేసిన కారణంగా మనస్పర్ధలు, విభేధాలు తలెత్తి కలవరం గొడవల రూపంలో బయటపడతాయి. చివరకు అంతా మనసుకు అర్ధం అయినా తరవాత కలిగే "పశ్చాత్తాపం" దాన్ని కప్పేసి విధ్వంసానికి కరణమయ్యేదే అహం - అహంకారాలే. 

 

అదే దుర్గుణం ముందు ఎవరు పలకరించాలో, క్షమాపణ కోరాలో అన్న మీమాంసలో ఆలోచనలో పడేఅసి తాత్సారం కూడా చేయించి సర్వం పతనోన్ముఖం పట్టిస్తుంది ఈ ఆహంకారం.

 

అహంకారానికి తలొగ్గిన మనిషి తనలోని అహంకార గుణానికి 'ఆత్మాభిమానం' అని చెప్పి సంతృప్తి పడినట్లే - ఆ అహంకారి చర్యలకు గురయ్యే బాధితులు మరియు గమనించే ఇతరులు దీనినే 'గర్వం' అంటారు. దుర్యోధనునిలో ఉన్న అహంకారం వల్లనే పాండవులతో తగువులాట ఎక్కువైంది. వారి కన్నా తాను మిన్న అన్న భావన వ్యక్తం చేసే పలు సంధర్భాల్లో మహాభారత ప్రతి నాయకుడు దుర్యోధనుడు ఎన్నోవిధాల ఇబ్బందులు పడ్డాడు - తాత్కాలిక ఆనందంతో పరవసించి పోతూ చివరకు సర్వ భ్రష్టత్వం పొందాడు.  

 

కాని మనలొ ఎవరి వాదన స్వభావం నైజం యధార్ధం అన్న ప్రశ్న మనకు మనమే వేసుకొంటే గర్వం లేక అహం అనేది మనలో తొంగి చూడనే చూడదు. ఎందుకంటే ఈ సృష్టిలోని అతిచిన్న పిపీలికం నుంచి దాన్ని సృష్టించిన విధాత వరకు ప్రతి ఒక్కరి జన్మకు ఒక కారణం అలాగే ఏదో కనీసం ఒక నైపుణ్యం నిండి ఉంటుంది. 

 

ప్రతి ఒక్కా జీవి తన బ్రతుకు బాటలో మనుగడ కొనసాగించటానికి తగిన నైపుణ్యం కలిగి ఉంటారు. ఒకరు చేసింది మరొకరు చూసి గ్రహించి నేర్చుకుని దాని అలాగే లేదా అంతకంటే గొప్పగా చేయగలరేమో కాని - అసలు వ్యక్తికి స్వతహాగా ఆ గుణం జన్మతః లభించి ఉంటుంది.

 

ఉదాహరణ పక్షులకు ఎగిరే గుణం వాటికి జన్మతః ఉంటుంది. ఈ గుణం నిసితంగా పరిసీలించి శాస్త్రవెత్తలు విమానాలను ఆ యంత్రాల్లో పొదిగి వాటిని ఎగిరేలాగా చేయటం నేర్చుకున్నారు. 

 


అలాగే మానవులకు నడిక, మాట్లాడటం అనే గుణాలు జన్మతః లభించాయి. పక్షికున్న ఎగిరే లక్షణం చేపకు లేదు కదా! అలాగే చేప కున్న ఈదే లక్షణం పక్షికి రాదు కదా! చేప ధీర గంభీర కడలిని చూసి బెదరక అందులో ఈద గలదు. అలాగే ప్రతి మనిషిలోను ఏదో ఓ ప్రత్యేక గుణం ఉంటుంది. ఆ గుణం మిగిలిన వారికి లేకపోవచ్చు. కాని వారు అందులో ఏకాగ్రతతో నేర్చుకుంటే ఆ గుణం లోను నేర్పును సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే మానవులకు సాధ్యం కాని విద్య ఏదీ ఉండదు. అణకువ తో అహంకారాన్ని జయించిన వారు ఈ రహస్యాన్ని చేధించిన వారే కదా! 

 


కాని "మనకున్న గుణం వేరొకరి లేదు" అనుకొంటూ అహం పెంచు కుంటే ఒకనాడు అఘాదపు అడుగున పడిపోయే ప్రమాదం పొంచి ఉండనే ఉంది. గుణాలు సహజ సిద్ధంగా రావాలి, లేదా సహనంతో నేర్చుకొని అందులో నైపుణ్యం పెంచుకవాలి సాధించాలి తప్ప ఫులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్టు ప్రవర్తిస్తే ఆ మనిషిని   అభాసుపాలు చేస్తాయి.

 


ఓసారి రారాజు సుయోధనుడు నేనిచ్చిన రాజ్యంతో కర్ణుడు దాన కర్ణుడుగా పేరు తెచ్చుకుంటున్నాడు అలాంటి నాకు సర్వం ఉండి కూడా ఆ కీర్తి నాకెందుకు రావడం లేదు అని తలచి - రాజప్రసాదంలో ఓ ధర్మ గంట కట్టాడట. ఎవరైనా ఆర్తులు వచ్చి ఆ ధర్మ గంట మోగిస్తే వారికి ఏంకావాలో? అది దానంగా ఇస్తానని అని రారాజు ప్రకటించాడు. 

 


కాని కర్ణుడనే దానశీలి లోని దానగుణం అనే సుగుణాన్ని అహంకారంతో తాను అనుసరించి కీర్తి ప్రతిష్ఠలు పొందాలనే దుగ్ధతో - అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా సుయోధనుడు ప్రయత్నిచగా - దాన్ని తుదముట్టించాలని భగవంతుడు తలచాడు. వెంటనే వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి తనకు యాగం చేయడానికి కట్టెలు కావాలని అడిగాడట రారాజును. అంతేకదా! ఎన్నైనా తీసుకుపొమ్మని వాగ్ధానం ఇచ్చాడట ఆ సుయోధన సార్వభౌముడు. అయితే ఆ బ్రహ్మణుడు ఇపుడు వద్దు నేను మరలా వచ్చి తీసుకెళ్తానని అన్నాడట. 

 


అలాగే కర్ణుడి దగ్గర కూడ వాగ్ధానం తీసుకొని వెళ్లిన ఆ బ్రాహ్మణుడు వాతావరణం ముసురు పట్టి జడి వానలు కురిసే కాలంలో తనకు కట్టెలు కావాలని వచ్చి అడిగినపుడు దుర్యోధనుడు కట్టెలు దానం ఇవ్వక పోగా ఇదా సమయం! అంటూ ఆ విప్రునిపై విసుక్కొని ఎపుడు తీసుకోవాలో నీకు తెలియదా! ఇపుడు వర్షంలో కుదరదు కదా మరోసారి  రావలసిందిగా కోరాడట. 



అంతట ఆ విప్రుడు దాన కర్ణుడి దగ్గరకు వెళ్లగా ఆయన తన వాగ్ధానం ప్రకారం ఆ విప్రునికి తన ఇంటి దూలాలు తీసి ఇచ్చాడట. అది తరవాత తెలుసు కున్న సుయోధనుడు - దానకర్ణుడన్న పేరు కర్ణునికే సరియైనది గుర్తించి, తన రాజ రసాధంలో తాను కట్తించిన దాన గంటను దుర్యోధనుడు తాను సార్వభౌముడైనా తాను తగనని తీసి వేయించాడట. అందుకే అహం అహంకారం ఎవరికైనా చెడునే కలిగిస్తుంది. దాన్ని దూరం చేసుకొంటే మంచిది. అణకువ, విధేయత అన్నింటా శ్రేయోదాయకం. 

మరింత సమాచారం తెలుసుకోండి: