ఉగ్రమూకలు అగ్రరాజ్యం అమెరికాపై దాడికి దిగిన సందర్భంలో పరిణామాల దృష్ట్యా అప్పట్లో తాలిబన్ లు ఆఫ్ఘన్ నుండి పారిపోయి, పాక్ లో దాక్కున్నారు. వాళ్లకు అప్పటికే పాక్ లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ఐఎస్ ఉగ్ర సంస్థ తమతోపాటు ఉండేందుకు అనుమతి ఇచ్చారు. అలా ఆఫ్ఘన్ లో అమెరికా దళాలు రెండు దశాబ్దాలు ఉన్నాయి. ఆ సమయంలో తాలిబన్ లు పాక్ గురించి బాగా అధ్యయనం చేశారు. దానికి పెద్దగా దిక్కులేదని, ఉన్న ఉగ్ర సంస్థలు తోటివాళ్లే కాబట్టి వాళ్ళతో కలిసి దానిని కూడా ఆక్రమించుకుంటే సరిపోతుంది అనే ఆలోచనలు అప్పటి నుండే చేసినట్టుగా ఉన్నారు. అందుకే మళ్ళీ ఆఫ్ఘన్ అక్రమణ తరువాత వీలైనంత వరకు పాక్ ను కూడా కాజేయడానికే చూస్తున్నారు.

అయితే ఇక్కడ తాలిబన్ లు ఆఫ్ఘన్ వెళ్ళిపోతే మళ్ళీ పాక్ కు దూరం అయిపోతామేమో అని వారిలో వర్గభేదాలు సృష్టించుకొని అక్కడ ఒక వర్గం తిష్ట వేసింది. మరో వర్గం ఆఫ్ఘన్ ను ఆధీనంలోకి తెచ్చుకుంది. ఒక్కసారి ఆఫ్ఘన్ ఆధిపత్యం తరువాత పాక్ పై దృష్టి పెట్టింది. ఇప్పటికే సరిహద్దులలో అనేక ప్రాంతాలను ఆక్రమించింది తెహ్రికి తాలిబన్ వర్గం. దానిని సహించలేని ఇమ్రాన్ తాలిబన్ లతో చర్చించడం కూడా జరిగింది. ఒకపక్క ఇమ్రాన్ కు వ్యతిరేకంగా అనేక ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు లేవనెత్తుతున్నారు. దీని వెనుక ఉన్నది కూడా తెహ్రికి తాలిబన్ లు మాత్రమే. వాళ్ళను సహించలేని ఇమ్రాన్ దిగిపోతే తరువాత వాళ్లకు నచ్చిన వారిని పీఠంపై కూర్చోబెట్టి చక్రం వాళ్ళ చేతిలోకి తీసుకోని, అనంతరం ఒక సందర్భం చూసుకొని తాలిబన్ జండా ఎగురవేయాలన్నది వాళ్ళ వ్యూహం.

పాక్ లో ఉన్నది కూడా ఇస్లాం అని, వాళ్ళు కూడా తాలిబన్ చట్టం అనుసరించాలని, మహిళలు స్వేచ్ఛ అనేది మరిచిపోవాలని తెహ్రికి తాలిబన్ ల ఆలోచన. కానీ దానికి విరుద్ధంగా పాక్ లో పరిస్థితులు ఉండటం వాళ్ళు సహించలేక, వీలైనంత త్వరగా తమ వ్యూహం అమలుకు ప్రయత్నిస్తున్నారు. దానికోసం మర్ధ్యవర్తిత్వం కోరుకుంటున్న ఇమ్రాన్ కోసం రెండు తాలిబన్ వర్గాల మధ్య బేధాభిప్రాయాలు వచ్చినట్టుగా నాటకాలు మొదలు పెట్టారు. ఇలా పాక్ కూడా తాలిబన్ స్వాధీనంలోకి వెళ్లే పరిస్థితులు బాగా కనిపిస్తున్నాయి. అయితే ఉన్న ఆఫ్ఘన్ లోనే ఇస్లామిక్ స్టేట్ మరియు తాలిబన్ లు ఆధిపత్య పోరు చేస్తున్నారు. మరి మొదటి నుండి పాక్ లో ఉన్న ఇస్లామిక్ స్టేట్ తాలిబన్ ల వ్యూహాన్ని అమలు చేయనిస్తుందా లేదా వాళ్ళే ఈ వ్యూహాన్ని తాలిబన్ ల చేతులమీదుగా అమలు చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. అంటే, ఆఫ్ఘన్ తాలిబన్ లకు, ఐఎస్ కు పాక్ అన్నమాట. వాళ్ళు ఆస్తులు పంచుకున్నట్టుగా దేశాలను పంచుకునే యత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అన్నది చూడాలి. పాక్ తో కాస్త ప్రమాదమే కానీ రెండు ఉగ్ర దేశాలు ప్రపంచ పటంలో ఉండటం ప్రపంచానికి ఇంకా ఎక్కవుగా ప్రమాదాన్ని తెచ్చిపెట్టినట్టే. దీనిపై అంతర్జాతీయ సమాజం ఏవిదంగా స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: