
క్రమ క్రమంగా కొవిడ్ పాజిటివిటీ రేటు కూడా తగ్గుముఖం పడుతున్నదని సంకేతాలు కనిపిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. 1.06లక్షలకు పైగా కేసుల్లో కేవలం 2709 మందే ఆస్పత్రుల్లో చేరారని అధికారులు వెల్లడించారు. ఇందులో ఐసీయూలో చేరిన వారు కేవలం 287 మంది మాత్రమే అని తెలిపారు. 18 సంవత్సరాలు పైబడిన వారు 90.34 శాతం మందికి రెండు డోసుల వాక్సినేషన్ పూర్తయ్యిందన్న అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.
కోవిడ్ కేర్ సెంటర్లలో ఉన్నవారికి మంచి సదుపాయాలు ఇవ్వాలని ఆదేశించారు సీఎం. ఆస్పత్రుల్లో చేరుతున్నవారికి అర్హులైన వారందరికీ కూడా ఆరోగ్యశ్రీ కింద చికిత్స పూర్తిస్థాయిలో అందిచాలన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్ అమలు తీరు దేశం మొత్తం మాట్లాడుకునే విధంగా ఉండాలని సూచించారు. కోవిడ్ చికిత్సలో భాగంగా అనుసరించాల్సిన విధానాలపై ఎప్పటికప్పుడు అడ్వైజరీస్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం. బీమా సంస్థలు రేట్లకన్నా ఆరోగ్యశ్రీ కింద చికిత్సలకు మంచి రేట్లు చెల్లిస్తున్నామని సీఎం వెల్లడించారు.
రాష్ట్రంలోని ఏ పాఠశాలనూ మూసివేసేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసినది. టీచర్ల సంఖ్యను కుదించేది లేదని, అంగన్ వాడీ కేంద్రాలను తగ్గించేది లేదని వెల్లడించింది. అంగన్ వాడీ టీచర్లు, వర్కర్ల సంఖ్య తగ్గించేది లేదని ప్రభుత్వం తేల్చింది. విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యంగా జాతీయ విద్యా విధానం అమలు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించినది.