మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  మహిళలకు 51 శాతం నామినేటెడ్ పదవులు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దేశంలో మరెక్కడా ఇంతమంది మహిళా నేతలు లేరని అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తన చుట్టూ ఉన్న మహిళలంతా ప్రజాప్రతినిధులేనని అన్నారు. రెండున్నరేళ్లుగా మహిళా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. మహిళల రాజకీయ సాధికారత కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జగన్ వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, ఎంపీలు బిశెట్టి వెంకట సత్యవతి, వంగగీత, గొట్టేటి మాధవి, మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ, మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యేలు రోజా, విడదల రజనీ, ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్యే కల్పలతారెడ్డి, మా జీ ఎంపీ  కిల్లి  కృ పా రాణి, కృ ష్ణా జి ల్లా జె డ్పీ చైర్మ న్‌ ఉప్పల హా రిక, విజ యవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వివిధ కార్పొరేషన్ల చైర్ పర్సన్లు, డైరెక్టర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి మహిళలు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు తరలివచ్చారు. కాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కృష్ణా జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మంత్రులు, అధికారులతో సమావేశ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: