పొట్టకూటి కోసం ఊరు వదిలి సరిహద్దులు దాటి వచ్చినటువంటి ఆ వలస కూలీల బతుకులు ఆ మంటల్లోనే మాడిపోయాయి. హాహాకారాలు ఆర్త నాదాల కేకలతో వారి జీవితాలు దుర్భర మయ్యాయి. ఎగిసిపడుతున్న మంటలలో మాడి మసై పోయారు. బోయిగూడాలో జరిగినటువంటి ఘటనలో 11 మంది కూలీల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తెల్లవారు జరిగిన ఈ ప్రమాదంలో 11 మంది కూలీలు విగతజీవులు అయ్యారు. ఈ మహా విషాదం పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు. ఒక్కొక్కరికి ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తానని ప్రకటించారు.

 అలాగే కార్మికుల మృతదేహాలు వారి యొక్క స్వస్థలాలకు వెల్లెలా చూడాలని సీఎస్ ను ఆదేశించారు.  ఈ ప్రమాద ఘటన గురించి తెలియగానే ఘటనా స్థలానికి ఎనిమిది ఫైరింజన్లు చేరుకొని నిమిషాల వ్యవధిలోనే మంటలను అదుపులోకి తెచ్చాయి. ఇంతలోనే జరగాల్సిన ఘోరం అంతా  జరిగిపోయింది. ఎంత ప్రయత్నించినా వారి ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు. ఈ మృతులంతా బీహార్ నుంచి వచ్చినటువంటి వలస కూలీలు గా తెలుస్తోంది. అయితే ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందా అన్న కోణంలో చూస్తున్నారు. స్థలానికి హుటాహుటిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేరుకొని వివరాలను  తెలుసుకున్నారు

 విచారణ చేపట్టి పూర్తి వివరాలు తెలపాలని అధికారులకు ఆదేశించారు. అయితే వీరంతా ఉపాధి కొరకు హైదరాబాద్ వచ్చి తమ భవిష్యత్తు ఆశలతో నగరానికి చేరుకొని పొట్ట  పోసుకుంటున్న వారికి మంగళవారం రోజు చివరి రోజు అయింది. మరి ఈ 11 మంది కార్మికుల ప్రాణాలు తీసిన పాపం ఎవరిది. యజమాని నిర్లక్ష్యమే వీరి ప్రాణాలు తీసిందా.. ఇందులో అధికారుల వైఫల్యం ఎంత.. మరి వీరి కుటుంబాలకు భరోసా ఎవరిస్తారు అనే కోణంలో ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: