వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తాం..ఎన్నికలు ఎప్పుడుజరిగినా గెలుపు టీడీపీదే..వచ్చే ఎన్నికల్లో గెలుపు ఏకపక్షమే..ఇది చంద్రబాబునాయుడు తరచూ చెబుతున్న మాటలు. ఒక్కసారిగా చంద్రబాబు స్వరంలో వచ్చిన మార్పుచూసి పార్టీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే మొన్నటివరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయటానికి కూడా నేతలు ఇళ్ళల్లోనుండి బయటకు రాలేదు. అధికారంలోకి వస్తామన్న ఆశ చంద్రబాబులో ఏకోశానా కనబడలేదు.






అలాంటిది హఠాత్తుగా ఇంతమార్పు ఎలా సాధ్యమైంది ? ఎలాగంటే తాజాగా అనకాపల్లి సమావేశంలో చంద్రబాబు మాటల్లోనే బయటపడింది. ఇంతకీ విషయం ఏమిటంటే ఓటర్లను డబ్బులతో మ్యానేజ్ చేయాలన్నది చంద్రబాబు హిడెన్ అజెండాగా బయటపడింది. ఈ విషయాన్ని స్వయంగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీయే బయటపెట్టారు. వచ్చే ఎన్నికల్లో 25వేలమంది ఓటర్లను ప్రభావితం చేయగలిగిన నేతలను గుర్తిస్తున్నట్లు చెప్పారు. అలాంటివారితో పాటు ఓటర్లకు 10 రూపాయలు ఖర్చుచేయగలిగిన వారిని కూడా మ్యాపింగ్ చేస్తున్నట్లు బయటపెట్టారు.






నేతలపరిధిలో ఎన్ని ఓట్లను మ్యానేజ్ చేయగలరు, దానికోసం ఎంత డబ్బులు ఖర్చుచేస్తారు, ఏఏ పద్దతుల్లో ఓటర్లను మ్యానేజ్ చేయగలరనే విషయాలను నేతలతో మాట్లాడి తెలుసుకుంటున్నట్లు చెప్పారు. నిజానికి ఇవన్నీ సమీక్షల్లో మాట్లాడుకోవాల్సిన విషయాలు కాదు. టికెట్ రేసులో ఉన్న నేతలతో వన్ టు వన్ మాట్లాడుకోవాల్సిన మాటలు. ఈ పద్దతి ఒక్క టీడీపీలోనే కాదు అన్నీపార్టీల్లోను ఇంతే. కాకపోతే చంద్రబాబు ఇలాంటి విషయాలను నేతలతో బహిరంగంగా మాట్లాడటమే విచిత్రంగా ఉంది.







అధికారంలో ఉన్నపుడు నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికను ఇలాగే గెలుచుకున్నారు. బూత్ ల వారీగా డబ్బులు వెదచల్లగలిగిన నేతలను గుర్తించి, వారికి బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో అధికారంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు వ్యూహం ఫలిచింది. అదే ఎత్తుగడ 2019 సాధారణ ఎన్నికల్లో బోల్తాపడింది. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకే ఇన్ని ఆలోచనలుంటే మరి అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంకెన్ని వ్యూహాలు రచించాలి. అధికారంలో ఉండి కోట్లరూపాయలు ఖర్చుచేసినా ఎందుకంత ఘోరంగా ఓడిపోయారనే విషయాన్ని చంద్రబాబు ఇప్పటికీ నిజాయితీతో విశ్లేషించుకోవటంలేదు. మరి హిడెన్ అజెండా ఎంతవరకు వర్కవుటవుతుందో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: