
ఇక ఈ ఆందోళనల నేపథ్యంలో ఎన్నో ప్రాంతాలలో హింసాకాండ జరిగింది అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపత్ పథకంపై నిరసనలో భాగంగా ఇటీవలే హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఏకంగా ద్విచక్ర వాహనాలతో పాటు రైళ్లను పూర్తిగా తగలబెట్టారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా రాళ్ళు రువ్వి పోలీసులకు కూడా గాయాలు చేసారు. చేసేదేమీ లేక పోలీసులు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ తో పాటు రబ్బరు బుల్లెట్లు ప్రయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది అనే చెప్పాలి.
అయితే ఈ ఆందోళనలో కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో రబ్బరు బుల్లెట్లను కాకుండా నిజమైన బుల్లెట్ లతోనే కాల్చారు. ఈ క్రమంలోనే చాతికి బుల్లెట్ గాయమై ఆంబులెన్స్ లో ఓ యువకుడు వెళ్లిన వీడియో వైరల్ గా మారిపోయింది. అయితే అతని పేరు వినయ్. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మధ్య పంచ గ్రామానికి చెందిన వాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన కాల్పుల్లో అతని చేతికీ గాయం కావడంతో నడుచుకుంటూ వెళ్లి రైల్వే స్టేషన్ బయట పడి పోయాడు. 108 వాహనంలో అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాధితుడు ఆర్మీ ఉద్యోగం కోసం హైదరాబాద్లో శిక్షణ పొందుతున్నా.. నా గుండెల్లో బుల్లెట్ దిగింది. ఒకవేళ నేను చనిపోతే దానికి పోలీసులతో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కారణం అంటూ తెలిపాడు.