చంద్రబాబునాయుడును జూనియర్ ఎన్టీయార్ వెంటాడుతున్నారంటే సినిమాల్లో చూపించినట్లు చేజ్ చేస్తున్నారని కాదు. చంద్రబాబు ఎక్కడ సమావేశాలు పెట్టినా అక్కడ జూనియర్ ఫొటోలు, కటౌట్లు వెంటాడుతున్నాయని అర్ధం.  జూనియర్ అభిమానులు ఎన్టీయార్ ఫొటోలున్న పోస్టర్లను చేతిలోపెట్టుకుని రచ్చ రచ్చ చేస్తున్నారు. కుప్పంలో మొదలైన ఈ ట్రెండ్ తాజాగా మచిలీపట్నంలో కూడా కంటిన్యు అయ్యింది. ఇంతకీ విషయం ఏమిటంటే మచిలీపట్నంలో చంద్రబాబు పర్యటించారు. టౌనులోకి చంద్రబాబు రాగానే జూనియర్ అభిమానులు ఎన్టీయార్ ఫొటోలు అంటించిన పోస్టర్లతో  గోల మొదలుపెట్టారు.





చంద్రబాబు నిర్వహించిన ర్యాలీలో జూనియర్ కు మద్దతుగా పెద్దఎత్తున అభిమానుల నినాదాలతో ఆ ప్రాంతం  మారుమోగిపోయింది. కాబోయే సీఎం సీఎం అంటు జూనియర్ ను ఉద్దేశించి అభిమానులు నినాదాలు చేయటం చంద్రబాబుకు ఏమాత్రం రుచించనిదే. అయితే ఏమి చేయలని పరిస్ధితి. ఒకవేళ జూనియర్ అభిమానులను వారిస్తే వాళ్ళింకా రెచ్చిపోతారు. అది ఇంకో వివాదంగా మారినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అందుకనే జూనియర్ కు జేజేలు కొట్టడం, సీఎం సీఎం అని అరవటం తనకు వినబడనట్లే చంద్రబాబు ఉండిపోతారు.  అయితే ఈసారి మాత్రం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. అభిమానులందరినీ ఈడ్చేయాలని కార్యకర్తలకు చెప్పారట.





ఇపుడు మచిలీపట్నంలో జరిగిందిదే. కాకపోతే ఈసారి జూనియర్ ఫొటోలతో పాటు నందమూరి హరికృష్ణ, నందమూరి తారకరత్న ఫొటోలు కూడా కనబడటమే విశేషం. జూనియర్ ను చంద్రబాబు, లోకేష్ ఎంత దూరంగా పెడదామని ప్రయత్నిస్తుంటే అంత రివర్సు కొడుతోంది. జూనియర్ను తండ్రి, కొడుకులు దూరంగా పెడుతున్నారన్న విషయం పార్టీలోను, బయట అందరికీ తెలిసిన విషయమే.





అందుకనే  ఎంతమంది ఎంతగా ప్రయత్నించినా జూనియర్ పార్టీ విషయాలు కానీ రాజకీయాలు కానీ మాట్లాడటంలేదు. ఆమధ్య హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో జూనియర్ విందులో కలవగానే టీడీపీలో సంచలనమైపోయింది. జూనియర్ ఎక్కడ బీజేపీకి మద్దతుగా మాట్లాడుతారో అని తమ్ముళ్ళు భయపడిపోయారు. అందుకనే జూనియర్ను టీడీపీలో చేరాలంటు వరసబెట్టి రిక్వెస్టులు చేశారు. అప్పట్లో అమిత్ తో జూనియర్ భేటీ అవటం చంద్రబాబును కలవరపెట్టేసింది. అలాంటిది తన ర్యాలీలో జూనియర్ కు జిందాబాదులు కొడుతు సీఎం సీఎం అని అరుస్తుంటే చంద్రబాబుకు మండిపోదా. కానీ చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోయారంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: