మహిళలు సాధికారతే జగతికి సాధికారత. స్త్రీ లేనిదే ఏమీ లేదు. స్త్రీలని ఎంతో హీనంగా ఎదుగుదల లేకుండా అభివృద్ధి చేయకుండా ఉంచేవారు. కలల్ని, ఆశయాలనీ, ఆలోచనలనీ చంపుకుంటూ కూర్చోవాలన్నట్టు చేసారు. కాని స్త్రీ కూడా అన్ని రంగాల్లో రాణించగలదని, స్త్రీకి కూడా రాజకీయాల్లో పాత్ర ఉందని ఆదర్శంగా నిలిచారు మన ప్రతిభా పాటిల్ .
 
IHG
 
 
భారతదేశానికి 12వ రాష్ట్రపతి. తొలి మహిళ రాష్ట్రపతి ఈమె. 2007 నుండి 2012 వరకు రాష్ట్రపతిగా కొనసాగించారు. 2004 నుండి 2007 వరకు రాజస్థాన్ గవర్నర్గా సేవలు అందించారు.  మహారాష్ట్రలో నందగావ్లో ఈమె జన్మించారు. బి.ఎ. పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఈమె టేబుల్ టెన్నీస్లో మంచి ప్లేయర్. కళాశాలలో ఉన్నప్పుడు అంతర్-కళాశాలలతో పోటీ పడి గెలుపొందింది. 
 
డిప్యుటీ మంత్రి, పబ్లిక్ హెల్త్, ప్రొహిబిషన్ పర్యాటకం, హౌసింగ్, కేబినేట్ మంత్రి, రిహేబిటేషన్, సాంస్కృతిక వ్యవహారాలు, గృహనిర్మాణంలో ఇలా అనేక రకాల పదవులలో పని చేసారు ప్రతిభా పాటిల్. రాజస్థాన్ గవర్నర్గా, భారత్ రాష్ట్రపతిగా అనేక ఖ్యాతి పొందారు. ఒక మహిళా ఇంతలా రాజకీయాల్లో రాణించిందా అని ఆశ్చర్యం కలిగేలా ప్రతిభా పాటిల్ అంత ఘనత సాధించారు. ఎందరో మహిళలకి స్ఫూర్తి మన ప్రతిభా పాటిల్.
 
IHG
 
 
ఆడవాళ్ళకి ఆదర్శంగా నిలిచారు. మొట్టమొదటి మహిళా రాష్ట్రపతిగా ఎన్నో సేవలందించి చరిత్రలో నిలిచిపోయారు. ఇటువంటి స్త్రీలు దేశంలో ఉంటే ఏ స్త్రీకి కూడా నిరాశ ఉండదు. ఆదర్శంగా తీసుకుని జీవిత ప్రయాణాన్ని ఎంతో ఆనందంగా బాటలో వెళ్తారు. అలానే ఎప్పుడు వీరి జీవితాన్ని చూసుకుని అదే దారిలో వెళ్ళడానికి మార్గదర్శకులు అవుతారు. అటువంటి గొప్ప మార్గదర్శకురాలు మన ప్రతిభా పాటిల్. నిజంగా అటువంటి స్త్రీలు మన దేశంలో రాణించి భవితకి బాటగా నిలవడం మన అదృష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి: