
దేశవ్యాప్తంగా జనాభా గడలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త జనాభా గణన తర్వాత 2026 లో నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్ అవుతుందని .. 2027లో జెమిని ఎన్నికలు ఉంటాయన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలు 225 కు పెంచుతారు. ప్రతి లోక్సభ నియోజకవర్గానికి కొత్తగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి. ఇలా ఉంటే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2009లో నియోజకవర్గాల పునర్ విభజన జరిగినప్పుడు అత్తిలి - పెనుగొండ నియోజకవర్గాలు పూర్తిగా రద్దు అయ్యాయి. ఈ క్రమంలోనే నిడదవోలు కొత్తగా ఆవిర్భవించింది. అయితే ఇప్పుడు జిల్లాల మార్పుతో నిడదవోలు - గోపాలపురం - కొవ్వూరు నియోజకవర్గాలు తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్లిపోయాయి. కృష్ణా జిల్లాలోని కైకలూరు - నూజివీడు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలో కలిశాయి.
ఇప్పుడు నియోజకవర్గాలకు పునర్విభజన జరిగితే ఖచ్చితంగా ఏలూరు జిల్లాలో ఒక అసెంబ్లీ స్థానం .. అటు పశ్చిమగోదావరి జిల్లాలో మరో అసెంబ్లీ స్థానం పెరగనున్నాయి. ఏలూరు జిల్లాలో రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న జంగారెడ్డిగూడెం కొత్త నియోజకవర్గంగా ఆవిర్భవించడంలో ఎలాంటి సందేహాలు లేవు. ఇక పశ్చిమగోదావరి జిల్లాలో రద్దయిన అత్తిలి - పెనుగొండ నియోజకవర్గాల్లో ఏదో ఒకటి మళ్లీ ఏర్పాటు చేస్తారా ? లేదా వీరవాసరం లేదా భీమవరం రూరల్ పేరుతో కొత్త నియోజకవర్గం ఏర్పాటు అవుతుందా ? అన్నది చూడాలి. ఏది ఏమైనా ఏలూరు జిల్లాలో ఒక అసెంబ్లీ సీటు పశ్చిమగోదావరి జిల్లాలో ఒక అసెంబ్లీ సీటు పెరగడం అయితే ఖాయం అని చెప్పాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు