
ఎంతోమంది యువ ఆటగాళ్లు పాతికేళ్లు కూడా నిండకముందే అటు అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి అదర కొడుతూ ఉంటే క్రికెట్ లెజెండ్ సచిన్ కొడుకు మాత్రం ఇంకా అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. అయితే అటు ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అర్జున్ టెండూల్కర్. ముంబై ఇండియన్స్ లో ఉన్నాడు అన్నమాటే కానీ అతనికి ఒక్కసారి కూడా తుది జట్టులో ఆడే అవకాశం లభించలేదు. దీంతో ఇక అతని పట్ల ముంబై ఇండియన్స్ యాజమాన్యం వివక్ష చూపిస్తుంది అంటూ విమర్శలు కూడా వచ్చాయి. కేవలం సచిన్ కొడుకు కావడంతోనే 20 లక్షల బెస్ట్ ప్రైస్ పోతే పోనీ అనుకుని అతను జట్టులో పెట్టుకుంటుందని మరి కొంతమంది కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.
గత ఏడాది పేలవ ప్రదర్శన చేసిన సమయంలో అయినా అర్జున్ టెండూల్కర్ కు తుది జట్టులో చోటు తగ్గుతుంది అనుకుంటే అది జరగలేదు. ఇక ఇటీవలే రోహిత్ శర్మకు అర్జెంట్ టెండుల్కర్ గురించి ఇలాంటి ప్రశ్న ఎదురయింది. 2021 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ లో అర్జున్ ఉంటున్నాడు. కానీ ఇప్పటివరకు అరంగేట్రం చేయలేదు. ఈసారైనా అరంగేట్రం చేస్తాడా లేదా అని జర్నలిస్టుల ప్రశ్నించగా.. మంచి ప్రశ్న అడిగారు.. అతను అరంగేట్రం చేస్తాడని ఆశిస్తున్నాం అంటూ రోహిత్ సమాధానం చెప్పుకొచ్చాడు. చూడాలి మరి ఈసారైనా తుది జట్టులోకి వచ్చే మోక్షం అర్జున్ టెండూల్కర్ కు లభిస్తుందో లేదో.