ఢిల్లీ లిక్కర్ స్కాంలో నాలుగు సార్లు కవిత పేరు ఛార్జిషీట్ లో పేర్కొన్నారు. ఇందులో కీలకమైన వాళ్లు తెలుగు రాష్ట్రాల్లో కల్వకుంట్ల కవిత, మాగుంట శ్రీనివాసులు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి ఆప్ నేత మనీష్ సిసోడియాను ఈడీ విచారించనుంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసు రోజు రోజుకు మలుపులు తిరుగుతోంది. ఏ హోటళ్లో మాట్లాడారు, ఎక్కడ దిగారు ఎక్కడికి వెళ్లారు అనే వివరాలతో సహా ఈడీ విచారణ జరుపుతోంది.


ఈ స్కాంలో పంజాబ్ లో జరిగిన ఎన్నికల్లో 100 కోట్లు తీసుకెళ్లడం, అందులో 70 కోట్లు గోవాకు వెళ్లడం వీటన్నింటిని ఈడీ జల్లెడ పట్టి మరి వెతుకుతోంది. ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెరపైకి తెచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ నుంచి కవిత పేరు బయటకు వచ్చాక. తెలంగాణలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆమె పేరును కూడా రాసేందుకు చాలా పత్రికలు, మీడియా భయపడ్డాయి. ఈ విషయంలో ఓ పత్రిక కాస్త తెగువ చూపించి ఆమె పేరుతో సహా వార్తను ప్రచురించింది.


అయితే లిక్కర్ స్కాం ముసుగును తొలగించుకునేందుకు రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెరపైకి వచ్చింది. మునుగోడు ఎన్నికల వేళా నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని బీజేపీ పార్టీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని గగ్గోలు పెట్టారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేల ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిందని రాష్ట్రంలో సిట్ దర్యాప్తు చేపట్టి నలుగురుని జైల్లో కూడా పెట్టారు.


బీజేపీ అగ్రనేత అమిత్ షా పాత్ర ఉందని ఆయనని కూడా అరెస్టు చేసే ప్రయత్నాలు తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. అది వీరి వల్ల కాలేదు.  బీజేపీ అగ్రనేతల ప్రమేయం ఉన్నట్లు బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. దీనిపై బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగాయి. రాష్ట్ర సర్కారు కేసును సీబీఐకి అప్పగించవద్దని సుప్రీం కోర్టులో కేసు వేసింది. ఇక్కడే అందరికీ అనుమానం కలుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: