
ఇందులో 90 శాతం మేర రుణాలు ఉన్నాయి. 13.99% వడ్డీ మీద తీసుకున్న రుణాలు 90 శాతం మేర ఉన్నాయి. అంటే అప్పుకి వడ్డీ ఎక్కువ పెట్టి తీసుకున్నారనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది. 2018 నుండి 2022 వరకు అంతర్గత రుణాలు 77.54% పెరిగాయి. గడిచిన ఐదేళ్లలో తలసరి రుణం 61శాతం మీద పెరిగింది. మధ్యసరి రుణాలు కూడా కలిపితే తలసరి రుణ భారం 92,797రూ"గా నమోదయింది.
వచ్చే ఏడేళ్లలో 1,29,817కోట్ల రూపాయలు తీర్చాలి. అంటే ఏడాదికి పాతిక వేల కోట్ల రూపాయలు తీర్చాలి. గతంలో చంద్రబాబునాయుడు ఉన్నప్పుడు చెప్పిందీ ఇదే, ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు చెప్పేది ఇదే రాబోయే కాలంలో ఎవరు వచ్చినా కూడా జరిగేది, చెప్పేది కూడా ఇదే. అసలు అప్పు రూ. 3,72,503 కోట్లు అయితే ప్రచారంలో మాత్రం పది లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు అని వ్రాస్తున్నారు.
రేపు రాబోయే వ్యవహారంలో అందులో లోట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్లో రూ. 688 కోట్ల రెవిన్యూ వ్యయాన్ని మూలధన వ్యయంగా వక్రీకరించారు. నవరత్నాల్లో భాగంగా వైఎస్సార్ గృహ వసతి పథకాన్ని మూలధన వ్యయంగా ప్రభుత్వం చూపించింది.