ఈ మధ్యకాలంలో యూట్యూబ్‌లో టాలీవుడ్ సాంగ్స్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. మ్యూజికల్‌గా మంచి హిట్‌లుగా నిలుస్తున్నాయి. ఇప్పటికే లైఫ్ ఆఫ్ రామ్, అల వైకుంఠపురములో, శశి వంటి సినిమాల్లో పాటలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. ఇక  ఇదే వరుసలో మరికొన్ని సినిమా పాటలు కూడా చేరుతున్నాయి. తాజాగా నాగ చైతన్య - సాయి పల్లవి కాంబోలో రాబోతున్న లవ్ స్టోరీ చిత్రంలోని సారంగదరియా సాంగ్ కూడా చేరింది. తాజాగా ఈ పాట యూట్యూబ్ వేదికగా 200మిలియన్స్ పైగా వ్యూస్ సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది.

చైతూ - సాయిపల్లవి కాంబినేషన్‌లో తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీలోని ఈ పాట ప్రస్తుతం రికార్డ్స్ బ్రేక్ చేస్తోంది. ‘దాని కుడిభుజం మీద కడవ దాని గుత్తెపు రైకలు మెరియా.. అది రమ్మంటే రాదురా సెలియా దానిపేరే సారంగదరియా..’ అంటూ సాగే ఈ జానపద పాట రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎంతో ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 28న మేకర్స్ఈ సాంగ్ రిలీజ్ చేశారు. రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సాంగ్ వైరల్ అవుతోంది. ఈ పాట అందాన్ని టాలెంటెడ్ సింగర్ మంగ్లీ తన గొంతుతో మరింత అందం పెంచింది. ఇక హీరోయిన్ సాయిపల్లవి స్టెప్స్‌తో పాట రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. జానపద పాట అయినా.. సుద్దాల అశోక్ తేజ అందించిన మోడరన్ లిరిక్స్ పాటకే అందాన్ని తెచ్చాయి.

ఇదిలా ఉంటే.. లవ్ స్టోరీ సినిమా ఏప్రిల్ 16న థియేటర్లలో విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. అయితే తదుపరి రిలీజ్ డేట్‌పై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా లేదు. కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చిన తరువాత సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాకు సీహెచ్ పవన్ సంగీతం అందించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అమిగోస్ క్రియేషన్స్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: