

ముద్దుగా బొద్దుగా బుగ్గలతో ఉండే నయనతార తర్వాత సినిమాల్లో ఒకదానికొకటి పూర్తి వ్యత్యాసం కనిపిస్తూ వస్తోంది. ఒక దాని తర్వాత మరో సినిమా హిట్ అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగి, హయ్యెస్ట్ రెమ్యునరేషన్ కూడా తీసుకుంటోంది. ఇలా ఇంకా కొంతమంది హీరోయిన్స్ ఉన్నారు.గత కొంత కాలంగా ప్రేమించుకున్న ఈ జంట త్వరలోనే మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇదిలా ఉంటే నయనతార ప్రస్తుతం ఒక సినిమా తర్వాత మరొకటి సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.
కాగా నయనతార ప్రేమ విషయం కు వస్తే... తమిళ యంగ్ హీరో శింబుతో ఆమె చాల కాలం రిలేషన్ లో ఉన్నారు.. కానీ కొన్ని కారణాల వల్ల హీరో శింబు తో.. బ్రేకప్ తర్వాత నయనతార ప్రభుదేవా ను ప్రేమించింది. నయనతార ను పెళ్లి చేసుకునేందుకు ప్రభుదేవా తన భార్య రమలత్ కు విడాకులు ఇచ్చాడు. కానీ ఏం జరిగిందో తెలియదు కొద్దీ గ్యాప్ రాగానే నయనతార తో ప్రభుదేవా విడిపోయారు. ఆతర్వాత నయనతార తన చేతిపై ఉన్న ప్రభుదేవా టాటూను కూడా తొలిగించింది. ఇప్పుడు నయనతార, ప్రస్తుతం డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో డేటింగ్ చేస్తున్నారు.