
నవంబర్ 20వ తేదీన ఈ మూవీ యొక్క తమిళ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను చెన్నైలో చాలా వైభవంగా పూర్తి చేశారు. ఈ ఈవెంట్ కి మూవీ యూనిట్ తో పాటు సినీ ప్రముఖులు ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు. ముఖ్యంగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాస్ మహారాజా రవితేజ లుక్స్ అందర్నీ బాగా ఆకట్టుకున్నాయి. పోతే తెలుగు వర్షన్ అయిన మట్టి కుస్తీ ట్రైలర్ ను 21వ తేదీ రాత్రి 8 గంటలకు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీని ఆకట్టుకునే కథ, కథనాలతో దర్శకుడు చెల్లా అయ్యావు ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని.. ట్రైలర్ చూస్తే మనకు స్పష్టం అవుతుంది.

ఇకపోతే డిసెంబర్ 2 తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్న నేపథ్యంలో మట్టి కుస్తీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నవంబర్ 27న ఆదివారం హైదరాబాదులో జే ఆర్ సీ లో ఘనంగా నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా రవితేజ తో పాటు మరికొంతమంది సీనియర్ ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం . మరి విష్ణు విశాల్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఏది ఏమైనా ఈ సినిమా విజయమైతే నిర్మాతగా రవితేజ కూడా సక్సెస్ అయినట్టే..