
రెండు వర్గాల సమాచారం అందుతున్న ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఎవరు ఊహించని విధంగా మొదటి రోజే రూ.2.3 కోట్ల రూపాయలు షేర్ ను రాబట్టింది.. రూ.4.65 కోట్ల గ్రాస్ వాసులను రాబట్టింది. నిన్నటి రోజు వరకు ఈ సినిమా కేవలం రూ.5.65 కోట్ల రూపాయల కలెక్షన్లతోపాటు రూ.9.75 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా మొదటి రోజు రూ.2.3 కోట్లు రాబట్టగా రెండవ రోజు రూ.1.11 కోట్లు మూడవరోజు రూ.1.21 కోట్లు నాలుగో రోజు 35 లక్షలు. మాత్రమే రాబట్టింది.
ఇక ఈ సినిమా ఓవరాల్ గా బిజినెస్ విషయానికి వస్తే రూ.11.30 కోట్ల రూపాయల థియెట్రికల్ బిజినెస్ జరగగా.. బ్రేక్ ఈవెంట్ సాధించాలి అంటే కచ్చితంగా ఈ సినిమా 12 కోట్ల రూపాయలను రాబట్టాల్సి ఉన్నది. ఇక ఈ సినిమా గట్టెక్కాలంటే ఇంకా రూ.6 కోత రూపాయలకు పైగా కలెక్షన్లను రాబట్టాల్సి ఉన్నది. మొదటి మూడు రోజులలోనే బ్రేక్ ఈవెన్ మార్కును అందుకుంటుంది అనుకున్న ఈ చిత్రం ఒకసారిగా ఇలా కావడంతో అభిమానులు కాస్త నిరుత్సాహ పడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో నటించిన బిబిసారా చిత్రం రూ. మొదటిరోజు ఏడు కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది. మరి ఏ మేరకు ఏ సినిమా లాభాలను అందిస్తుందో చూడాలి మరి.