రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాకి ఇటీవల ఆస్కార్ వరించిన విషయం తెలిసిందే. అయితే త్రిబుల్ ఆర్ కి ఆస్కార్ తన వల్లే వచ్చిందని తాజాగా బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. త్రిబుల్ ఆర్ సినిమాలోని 'నాటు నాటు' అనే పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇక ఆస్కార్ అవార్డుతో భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి త్రిబుల్ ఆర్ మూవీ చాటి చెప్పింది. ఇక త్రిబుల్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు ని దక్కించుకోవడంతో మూవీ యూనిట్ పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. అయితే త్రిబుల్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు ని అందుకోవడం పై బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆర్ ఆర్ ఆర్ లో అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ కి తండ్రిగా అజయ్ దేవగన్ కనిపించాడు. అయితే ప్రస్తుతం తాను నటిస్తున్న భోళా సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న అజయ్ దేవగన్ తాజాగా కపిల్ శర్మ షో కి హాజరయ్యాడు. ఈ క్రమంలోనే మీరు నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం ఎలా అనిపించింది? అని కపిల్ శర్మ అడగగా.. ఆ ప్రశ్నకు అజయ్ దేవగన్ బదులిస్తూ..' తన వల్లే త్రిబుల్ ఆర్ సినిమా ఆస్కార్ను గెలుచుకుందని అజయ్ దేవగన్ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు. నాటు నాటు సాంగ్ లో తాను డాన్స్ చేసి ఉంటే ఆస్కార్ వచ్చేది కాదని అజయ్ దేవగన్ చెప్పాడు.

తన డాన్స్ చూసి అకాడమీ జూరీ మెంబర్స్ ఆస్కార్ ఇచ్చేవారు కాదంటూ అజయ్ దేవగన్ ఫన్నీగా చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. డాన్స్ లో తాను చాలా పూర్ అనే విషయాన్ని తనపైనే తాను సెటైర్ వేసుకుంటూ సరదాగా కపిల్ శర్మ షోలో అజయ్ దేవగన్ ఇచ్చిన ఈ సమాధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. కాగా అజయ్ దేవగన్ నటిస్తున్న బోలా సినిమా మార్చి 30న విడుదల కాబోతోంది. తమిళంలో లోకేష్ కనకరాజు తెరకెక్కించిన ఖైదీ సినిమాకు ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్నట్లు ఈ సినిమాకి అజయ్ దేవగన్ స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: