ఖుష్బూ.. దక్షిణ భారతదేశంలో ఈపేరు తెలియని సినీ అభిమాని ఉండడేమో. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం ఇలా దక్షిణ భారత దేశ భాషల్లోనే కాదు.. ఉత్తరాదిన కూడా హీరోయిన్ గా రాణించిన నటీమణి ఖుష్బూ.. ఇక తమిళనాట హీరోయిన్లకు గుడి కట్టే సంప్రదాయం ఖుష్బూతోనే మొదలైంది. అంతగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారామె.

 

ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లయినా ఇంకా ఆమె తెరపై తన ప్రాధాన్యత కోల్పోలేదు. ఇటీవలే రజినీకాంత్ తో మరోసారి జోడీ కట్టేందుకు సిద్ధమవుతుందామె. ఆమె మనసులో మాటలను కమెడియన్ కమ్ యాంకర్ అలీ ఇటీవల ఓ షోలో బయటపెట్టించారు. ఆమె నుంచి తమాషా సమాధానాలు రాబట్టారు.

 

ఖష్బూకు తెలుగులో ఫేవరెట్‌ హీరో ఎన్టీఆర్. అందుకే వాళ్ల ఇంటికి వెళ్లి భోజనం కూడా చేసిందట. తారక్‌ను చూడగానే నాకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుందట. అందుకే తను ఫేవరెట్‌ హీరో అంటోందీ సీనియర్ నటీమణి. తన ఫేవర్ హీరో ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్‌ తీసుకుని.. దాన్ని భద్రంగా తమ ఇంటి లాకర్‌లో సేఫ్‌గా ఉంచిందట.

 

ఇంతకీ తారక్ లో అంతగా ఏం నచ్చిందంటే.. తారక్ డ్యాన్స్‌, యాక్టింగ్‌ సూపర్‌గా ఉంటుందంటోది ఖుష్బూ.. అంతేకాదు.. స్క్రీన్‌పై తారక్‌ ఏడిస్తే, నేను కూడా ఏడుస్తూ ఉంటుందట. తారక్ అంటే అంత పిచ్చి అభిమానం అని వివరించింది ఖుష్బూ.

 

ఖుష్భూ నాలుగు భాషల్లో దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించిందట. ఎప్పుడూ కౌంట్‌ చేసుకుంటూ సినిమాలు చేయలేదు.. ఇప్పుడు ఈ కౌంట్‌ అంటే డబ్బులు కూడా రావటం లేదంటూ నవ్వుతూ చెప్పింది. బోల్డ్‌ అండ్‌ బ్యూటీ అంటే ఖుష్భూ అని.. ఇప్పటికీ ఆ బోల్డ్‌నెస్‌ తనలో ఉందని చెబుతోంది. తనలో ఏ మార్పూ లేదట. తనే కాదు. ప్రతి మహిళకు బోల్డ్‌నెస్‌ ఉంటుంది. ఒక సమస్య ఉన్నప్పుడు అదే బయటకు వస్తుంది అంటోంది ఖుష్బూ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: