ఇద్దరు వివాదస్పద మంత్రుల తొలగింపు అంశం పై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ మధ్య విభేదాలు తలెత్తాయన్న వార్తలను కాంగ్రెస్ మీడియా విభాగం అధ్యక్షుడు జనార్దన్ ద్వివేది ఖండిస్తుండగా ఇది ఏ మాత్రం నమ్మడానికి వీలులేకుండా ఉంది. దేశం పై ఎంతో మంది ఉండగా పనిగట్టుకొని ప్రధాని, సోనియాగాంధీల మద్యనే విబేధాలొచ్చాయని ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఆ ప్రచారం ఎందుకు తెరపైకి వస్తుందనేది అందరికి కలుగుతున్న ఆశ్చర్యం.   కాగా సోనియా, మన్మోహన్ పరస్పరం చర్చించి అవగాహనకు వచ్చిన తరువాతే న్యాయ మంత్రి అశ్వినీ కుమార్, రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్ ను కేబినెట్  నుంచి తొలగించారని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అంటుండగా కేవలం సోనియావత్తిడి మేరకే మంత్రులను రాజీనామ చేయించారని ప్రచారం జరుగుతుంది.

సోనియా ఆదేశం మేరకే ఇరువురు మంత్రులు రాజీనామా చేశారనేది నిజం కాదని జాతీయ కాంగ్రెస్ పార్టీ మీడియా ఇంచార్జీ జనార్ధన్ ద్వివేది అంటుండగా నమ్మడానికి దేశప్రజలు అంత అమాయకులు కాదని ఖండిస్తున్న నాయకులు గ్రహించినట్లు లేరు.  అశ్వినీ కుమార్, పవన్ కుమార్ బన్సల్ ను తొలగించాలన్నది ఇరువురి సంయుక్త నిర్ణయమని ద్వీవేది అంటుండగా ఇంత రాద్దాంతం జరిగిన తర్వాత ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పలేకపోయారు.  కాంగ్రెస్ పార్టీలో విభేదాలు లేవని, గ్రూపులుండవని, గల్లీనుండి ఢిల్లీవరకు కూడా ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో భూతద్దం పెట్టి వెతికిన గ్రూపులు, వైరుద్యాలు కనిపించవని ద్వివేది నమ్మబలుకడానికి ప్రయత్నిస్తుండవచ్చుగాని  ప్రధాన నేతలిద్దరి మద్యన విభేదాల విషయం ఇలా మీడియా ద్వారా ప్రకటనలిచ్చుకుంటూ వారంతటవారే ప్రచారం చేసుకున్నట్లు అవుతుంది. ఏం జరిగిందో , ఎవరి మనసులో ఏముందో తెలియదుగాని నిప్పులేనిదే పొగరాదనే సామెత మాత్రం వీరి విషయంలో సరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: