
అస్తవ్యస్తంగా ఉన్న భాష బాగుపడితే ఇంకా ఆనందం
ఈ రెండూ ముఖ్యం.. అభివృద్ధి గుర్తించుకోదగ్గది
సంబంధిత సందర్భాల్లో భాష మరింత గుర్తించుకోదగ్గది
ఈ రెండూ వ్యక్తిత్వంకు, నిబద్ధతకు తార్కాణం
దేశ రాజధానిలో ఎంతో పేరు తెచ్చుకున్న
ఆ నాయకురాలు ఈ రెంటి గురించి స్పందించి ఏమన్నారంటే.....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలోనూ సమున్నత స్థాయిలో నిలవాలన్నది సీఎం జగన్ ఆకాంక్ష..ఆ ఆకాంక్షలకు అనుగుణంగా పాలన ఉందా? ప్రధాన ప్రశ్న..ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మంత్రుల భాష ఉందా? మరో ప్రశ్న..సంస్కరణకు నిలిచే ప్రశ్న..వీటిని అడుగుతూ ఉంటే..కొందరే నా వాదనకు దగ్గర..లేదా కొందరే పరిపక్వ ధోరణికి దగ్గర...ఆ కొందరిలో ఒకరు కృపారాణి.
ఎలా అంటే.....
మాట్లాడేవారు కాస్తయినా ఇతరుల మాటలకు విలువ ఇవ్వాలి..నోటికి వచ్చిన విధంగా మాట్లాడితే కోపం వస్తుంది..కానీ అవతలి వారి తీరు కారణంగానే మా నాయకులు స్పందిస్తున్నారు అని అంటున్నారు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి.మరి! భాషకు ఎ టువంటి సమ ప్రాధాన్యం ఇవ్వాలి..ప్రజల భాషకు ఎంతటి సుమున్నత స్థితి అందించాలి..ఇవన్నీ ముఖ్యం..వీటితో పాటు అభివృద్ధి ముఖ్యం..వైసీపీ భాషలో పరిణితి పాలనలో పరిపక్వత అన్నవి ఆశించడం ఓ బాధ్యత గల పౌరుడికి ప్రాథమిక హక్కులు..వీటిని దాటి,వద్దనుకుని ఎవ్వరు మాట్లాడరు..మాట్లాడకూడదు కూడా! వ్యక్తిత్వంలో ఎలాంటి అభివృద్ధి కోరుకుంటామో అదే విధంగా సమాజ రీతిలో కూడా అభివృద్ధి కోరుకుంటాం..అభివృద్ధి ఓ ప్రభుత్వ సంబంధిత చర్య..ఓ విధంగా భాష కూడా! మేం కాదు మా అభివృద్ధే మాట్లాడుతుంది అని అంటారు కదా! అదే ఇది. పాలన భాష,పాలిత భాష, అభివృద్ధి కూడా ఓ భాషకు సంకేతికే! మాట్లాడాలి అన్నీ....
వైసీపీ సర్కారుకు సంక్షేమమే కావాలి..అభివృద్ధి పట్టడం లేదు అన్న విమర్శకు ప్రధాన కారణంగా అస్తవ్యస్తంగా ఉన్న గ్రామీణ మరియు పట్టణ రహదారులు...ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తున్న తరుణాన సంబంధిత పనులపై ప్రభుత్వ బాధ్యులు చెబుతున్న మాటల కారణంగా ఒకింత ఆశ రేగుతోంది..ఆచరణ చూశాకే ఆ ఆశలు మరింత జీవం పోసుకుని,సంక్రాంతి తరు వాత పల్లెలకు,పట్టణాలకు కొత్త కాంతులు రావాలని కోరుకోవాలి.ఆ దిశగా జగన్ అడుగులు వేస్తే సంక్షేమం కోసం వెచ్చిస్తూనే, అభివృద్ధికి కాస్తైనా ప్రాధాన్యం ఇచ్చారన్న భావనకు రావొచ్చు..అయితే తమకు సంక్షేమం,అభివృద్ధి సమ ప్రాధాన్యాలు అని చెబుతున్నారు కృపారాణి..పొలిటికల్ సైన్స్ విత్ శంభుమహంతితో....
టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు రావడం లేదు అన్నది ఓ ప్రధాన ఆరోపణ..ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కూర్మంలో రెండు కిలోమీటర్ల రహదారిని వేసేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రావడం లేదు...అని వైసీపీని ప్రశ్నిస్తే..నిధులకు లోటు లేదు అని,టెండర్లు వేశారని చెబుతున్నారు..మరి! లోపం ఎక్కడ? సమన్వయ రీతికి ప్రామాణికం కావాలి కదా! ఇటువంటి ప్రశ్నలన్నీ మాజీ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన కార్యక్రమం పొలిటికల్ సైన్స్ విత్ శంభుమహంతి...
పల్లెకు కళ రావాలి.. పట్నం బాగుపడాలి..నగరం వీటి వెలుగులను తోడ్కొని మరింత వెలుగులీనాలి.ఇది కదా కావాలి.మరి! మన రహదారులు ఎలా ఉన్నాయి..ఎలా ఉండాలి..ఎలా ఉండబోతున్నాయి.2017 నుంచి రాష్ట్రంలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి అని చెబుతున్నారు కృపారాణి (శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి). శ్రీకాకుళం జిల్లా వైసీపీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ జర్నలిస్టు రత్నకిశోర్ నిర్వహించిన పొలిటికల్ సైన్స్ విత్ శంభుమహంతి అనే కార్యక్రమంలో ఆమె పలు విషయాలు వెల్లడించారు. మీ టెక్కలి నియోజకవర్గంలో రోడ్లన్నీ బాగున్నాయా..? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ..నా హయాంలోనే రోడ్లన్నీ వేయించాను.. ఇక మిగతా రహదారుల గురించి చెప్పాలంటే వర్షాలు బాగా పడడంతో చాలా చోట్ల అస్తవ్యస్తంగా ఉన్నాయి.వీటిని సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం.సంక్రాంతి తరువాత రోడ్లకు మహర్దశ పడుతుందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు చెబుతున్నారండి...అది నిజమేనా..? సీఎం కూడా నాడు - నేడు మాదిరిగానే రోడ్ల బాగు కోసం కృషి చేసి.. అభివృద్ధికి ముందు,తరువాత వాటి గురించి ప్రజలకు వివరిద్దాం అంటున్నారండి..ఇవన్నీ సాధ్యమేనా? అని అడిగిన ప్రశ్నకు..మే నాటికి రోడ్ల అభివృద్ధిని రెండు విడతలుగా చేయనున్నామని స్పష్టం చేస్తూ,గత ప్రభుత్వం అలసత్వం కారణంగా గ్రామీణ రహదారులు మరింత అధ్వాన స్థితికి చేరాయని ఆరోపిస్తూ..ప్రస్తుత ప్రణాళికను వివరించారు.