జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు చూస్తుంటే ప్రజాస్వామ్యం నుండి నియంతృత్వం వైపుకు మళ్ళుతున్నట్లే అనుమానంగా ఉంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నేతలు, కార్యకర్తలతో భేటీఅయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతు గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని ప్రభుత్వం 92 శాతం మంచిపనులు చేస్తున్నట్లు చెప్పారు. ఇన్నిమంచి పనులు చేస్తున్న మనం  వచ్చేఎన్నికల్లో 175కి 175 సీట్లూ ఎందుకు గెలవకూడదు ? ఎందుకు గెలవము ? అని ప్రశ్నించారు.





175కి 175 సీట్లలో గెలవటమన్నది చాలాకాలంగా చెబుతున్నదే. స్ధానికసంస్ధల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో సర్పంచ్ నుండి మున్సిపాలిటి వరకు వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనే వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసిందంటే ఇక అసెంబ్లీలో కూడా ఎందుకు పార్టీ గెలవదు అనే ఆలోచన మొదలైంది జగన్లో. చంద్రబాబును ఓడించేస్తే రాష్ట్రంలోని 175 సీట్లలో వైసీపీ గెలిచేస్తుందని గట్టిగా నమ్ముతున్నారు.





సరే జగన్ ఆలోచనల ప్రకారం వైసీపీ 175 సీట్లలోను గెలుస్తుందా లేదా అన్నది కాలమే సమాధానం చెబుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే జగన్ ఆలోచనలు ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. గట్టిగాచెప్పాలంటే ఇపుడే టీడీపీని జగన్ లెక్కచేయటంలేదు. అంటే ఇదే పద్దతిని గతంలో చంద్రబాబు కూడా ఫాలోఅయ్యారు. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు వైసీపీ 67 సీట్లతో గట్టి ప్రతిపక్షంగానే ఉండేది. సందర్భం ఏదైనా చంద్రబాబు చెప్పిందేమంటే రాష్ట్రంలో అసలు ప్రతిపక్షాల అవసరమే లేదని.





ఇపుడు జగన్ కూడా అదే ఫాలో అవుతున్నట్లున్నారు. నిజానికి ప్రతిపక్షం బలంగా ఉంటేనే అధికారపక్షం లేదా ప్రభుత్వం నియంత్రణలో ఉంటుంది. కేంద్రంలో ప్రతిపక్షాలు బలహీనమైపోవటంతో నరేంద్రమోడీ వైఖరి ఎలాగుంటుందో అందరు చూస్తున్నదే. ఏదేమైనా జగన్ ఆలోచనలు మాత్రం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమనే చెప్పాలి. గతంలో చంద్రబాబు చేసిన తప్పునే తాను కూడా చేస్తానని జగన్ అంటే ఎవరు చేయగలిగేది లేదు. 2019లో చంద్రబాబుకు ప్రజలు ఎలా బుద్ధిచెప్పారో మళ్ళీ అదే సీన్ రిపీటైనా ఆశ్చర్యపోవక్కర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: