
అయితే అనూహ్యంగా మొదటి సెమీఫైనల్ లో ఇండియాను ఆస్ట్రేలియా మట్టి కరిపించగా , మరో సెమీఫైనల్ లో సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ ను బోల్తా కొట్టించింది. నిన్న ఫైనల్ ముందు వరకు కూడా గెలిచేది ఆస్ట్రేలియానే అని తెలిసినా ఎక్కడో చిన్న ఆశ సౌత్ ఆఫ్రికాను విజయం వరించి మొదటి సారి వరల్డ్ కప్ ను ముద్దాడితే బాగుంటుందని ఎందరో కోరుకున్నారు. కానీ చివరికి విజయం మాత్రం ఆస్ట్రేలియా మహిళలనే వరించింది... దీనితో వరల్డ్ కప్ ల టైటిల్ సంఖ్యను పెంచుకుంటూ ముందుకు పోతోంది. ఫైనల్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ సౌత్ ఆఫ్రికా ముందు 157 పరుగుల లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా ముందు ఉంచింది.
సౌత్ ఆఫ్రికా ఓపెనర్లు వోల్వర్ట్ మరియు బ్రిట్స్ లు ఇన్నింగ్స్ ను చాలా నెమ్మదిగా ప్రారంభించారు. ముఖ్యంగా బ్రిట్స్ బంతిని టైం చేయడానికి చాలా ఇబ్బందులు పడింది. మొదటి వికెట్ కు 5 ఓవర్ లలో 17 పరుగులు మాత్రమే చేశారు. మరోవైపు వోల్వర్ట్ (61) మాత్రం ఒంటరిపోరాటం చేసినా ఉపయోగం లేకపోయింది. చేయాల్సిన రన్ రేట్ పెరుగుతున్న ఎక్కువ డాట్ బాల్స్ ఆడడం వలనే సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ కల చెదిరింది. ఇక కీలకం అయిన ఫైనల్ లో కప్ (11) , లస్ (2), ట్రయాన్ (25) , క్లర్క్ (8), బాచ్ (1) లు విఫలం అయ్యి ఫైనల్ లో కప్ ను ఆస్ట్రేలియాకు అందించారు. వోల్వర్ట్ తో పాటుగా మరొకరు జాగ్రత్తగా ఆడి ఉంటే ఫలితం వేరేలా ఉండేది.