ఆస్ట్రేలియా దేశంలో ఈ సంవత్సరం అక్టోబరులో జరగబోతున్న టీ-20 ప్రపంచకప్‌‌ లో ధోనీ ఆడటం కష్టమే అని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయ పడ్డారు. మాములుగా అందరూ అనుకున్నట్టుగానే ఐపీఎల్ - 2020 సీజన్‌ లో రాణించడంతో టీ-20 వరల్డ్‌ కప్ తుది జట్టులోకి రావాలని ధోనీ అనుకున్నాడు. కాకపోతే ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మార్చి 29 నుంచి మొదలు అవ్వాల్సిన IPL ఏప్రిల్ 15కి వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మెగా టోర్నీ జరగడంపైనా సందిగ్ధత కొనసాగుతుంది. దీనితో ధోనీ పరిస్థితి అయోమయంగా మారింది.

 

 


సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... వ్యక్తిగతంగా ధోని టీ - 20 వరల్డ్‌ కప్‌ జట్టులో ధోనీ ఉండాలని నేను భావిస్తున్న కానీ, నిజానికి టీంలోకి అతని ఎంపిక ఇప్పుడు చాలా కష్టం. దీనికి కారణం ఏమిటంటే ఇప్పటికే ధోనీని పక్కనపెట్టి టీమిండియా చాలా ప్రయాణించింది. ఇకపోతే ధోనీ రిటైర్మెంట్ వోషయానికి వస్తే, అతను అందరి మాదిరిగా ఘనమైన వీడ్కోలు కావాలని కోరుకోడు. కాబట్టి సైలెంట్‌గా క్రికెట్‌ నుంచి తప్పుకునే అవకాశం ఉందని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చారు. అయితే ధోనికి బదులుగా రిషబ్ పంత్ లేదా కేఎల్ రాహుల్‌కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: