తెలంగాణాలో కరోనా విలయం తారస్థాయికి చేరిందో? ఇప్పటికే చేరిపోయిందో? కూడా తెలియని పరిస్థితి.  కరోనా పోసిటివ్ కేసులు అత్యంత వేగంగా పెరుగుతూ ప్రజల గుండెల్లో మరణ మృదంగం మ్రోగిస్తుంది. ఇంత జరుగుతున్నా తెలంగాణ ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్లు "ఏడున్నాడో దోర" అన్నట్లు కనిపించటం లేదు. ప్రభుత్వానికి ఎలాంటి చర్యలు చేపట్టే ఉద్ధేశం లేనట్లు, నేడు రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తన ప్రెస్-మీట్ ద్వారా చెప్పకుండానే చెప్పేశారు.


రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ చెప్పిన విషయాలు:


  • *రాష్ట్రంలో లాక్-డౌన్ ఉండదని బల్లగుద్ది చెప్పేశారు.
  • *ప్రజలు తమంత తామె తమ ఆరోగ్యాలకు భాధ్యత వహించాలని తెలిపారు. (ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందనేనా మీ ఉద్దేశం)
  • *రాష్ట్రంలో అదుపులోనే కరోనా!.. (మరైతే ఇంత ఆందోళన ఎందుకు?)

  • *ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనం మెరుగే (ఎప్పుడు ప్రభుత్వం చేత అతిగా వాడబడుతున్న జోక్)
  • *10 రోజులుగా తీవ్రత తగ్గుతోంది. (నిజమేనా!)
  • *ఆక్సిజన్‌ కొరత లేకుండా చూస్తున్నాం (మీ చూసుడు గాదు! నిజంగా జరగాలి)

  • *ప్రజలు ఆందోళన చెందవద్దు. (ముఖ్యమంత్రినే ఒక ప్రముఖ ఆసుపత్రిలో పెట్టారు. మొత్తం ప్రభుత్వ వ్యవస్థలు కంటికి రెప్పలా చూసుకున్నారు. మరి ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలే కదా!)
  • *18-45 ఏళ్ల వారికి టీకా జూన్‌ లోనే!
  • *ఇంటింటి సర్వే! లక్షణాలుంటే కిట్లు! సరపరా అట!


ఇంతకు ముందే కరోనా విలయాన్ని ప్రభుత్వ అలసత్వాన్ని గమనించిన తెలంగాణా ఉన్నత న్యాయస్థానం ఈ విషయాన్ని సుమోటోగా తీసుకొని, కనీసం వారాంతంలో నైనా (వీకెండ్) లాక్ డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది. అంతేకాదు పెరిగిపోతున్న కరోనా కేసుల పరంపర ఉదృతమౌతున్న వేళ, సత్వరమే ఈ అంశాన్ని పరిశీలించాలని, ప్రస్తుతం అమలవుతున్నరాత్రి కర్ఫ్యూ సమయాన్ని పొడిగించే విషయాన్ని కూడా పరిశీలించాలని, రోజుకు లక్షకు పైగా కరోనా పరీక్షలు జరపాలని సూచించింది. ఇప్పటికే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఈ అంశాలపై పలు ఆదేశాలు జారీ చేస్తూవస్తుంది.


ఇంత జరిగినా, విలయం చెలియలి కట్ట దాటుతున్నా తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ మాత్రం రాష్ట్రంలో లాక్ డౌన్ పెట్టాల్సిన అవసరమే లేదని ప్రెస్ మీట్ లో తన బాధ్యతా రాహిత్యాన్ని ప్రకటించేశారు. ఇంకా యదార్ధ పరిస్థితులను ఆయన ఆకళింపు చేసుకున్న దాఖలాలు కనిపించట్లేదు. ఆకళింపు చేసు కోకుండా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని, అందువల్ల లాక్ డౌన్ అవసరం లేదని చెప్పడం ప్రజలకు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. అంతకుమించి కరోనా సమస్యకు లాక్ డౌన్ పరిష్కారం కాదని కుండ బ్రద్ధలు గొట్టారు.


తెలంగాణా ప్రజలు ఇప్పటి వరకు ఆరోగ్యం విషయంలో ప్రత్యేకించి కరోనా విషయంలో సదా సంప్రదించే ఆ శాఖ మాజీ మంత్రి ఈటెల రాజెందర్ ప్రస్తుతం తమ పదవి నుంచి తప్పించ బడ్డారు. ఈ కష్ట కాలంలో ఎవరిని సంప్రదించాలో, తమను ఎవరు రక్షించగలరో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు.

ఇక ఆ వైద్య ఆరోగ్య శాఖ స్వయంగా ముఖ్యమంత్రే పర్యవేక్షించనున్నారు. కాని గత యేడేళ్ళ ఈ ముఖ్యమంత్రి పాలనా కాలంలో - ఆయన ప్రజా పాలన క్షేత్రమైన సచివాలయానికి వచ్చిన దాఖలా గాని, కనీసం ప్రజా సమస్యలు తీర్చటానికి ప్రజలు తమ పిర్యాదులు స్వయంగా అందజేయటానికి వీలు కలిపించే "ప్రజాదర్బారు" గతంలో ఎన్టీఆర్, వైఎస్ఆర్ నిర్వహించినట్లు నిర్వహించే సాంప్రదాయం కూడా నవ తెలంగాణా రాష్ట్రంలొ లేదు. అయినా ఆయన దర్శనం మంత్రులకు, శాసన సభ్యులకు, ఇతర ప్రజా ప్రతినిధులకు కూడా అతి దుర్లభం అని అంటున్నారు  ఇక ఆయన్ని సంప్రదించటం సామాన్యులకు అసాధ్యమేనని చెప్పటానికి అనుమానమే ఉండక్కర్లేదు. అసలే కరోనా సమస్యలతో విసిగి వేసారిన ప్రజలకు సీఎస్ వ్యాఖ్యలు ఒక్కసారి అగ్నిలో ఆజ్యం పోసినట్లైంది. ఇప్పుడు తెలంగాణ ప్రజానీకం భగ్గుమంటోంది.


ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా తెలంగాణలో అదుపులోనే ఉందని సోమేశ్ కుమార్ ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్, ఆక్సిజన్, ఆస్పత్రుల్లో బెడ్స్, వెంటిలేటర్స్ మొదలైన వాటికి ఎలాంటి లోటూ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రం లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఈ రోజు (బుధవారం) ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంగా కొన్ని రోజులుగా కేసులు తగ్గుతూ వస్తున్నాయని, ప్రతి ఆస్పత్రిలో రోగులకు సరైన సదుపాయాలతో పాటు ఆక్సిజన్ కూడా అందుబాటులో ఉండేలా తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి తమను కార్యోన్ముఖులను చేశారని ఆయన పేర్కొన్నారు.


సీఎం కేసీఆర్‌కు కరోనా సోకినా, ప్రతి రోజు తమతో సమీక్షలు నిర్వహించారని ఆయన వెల్లడించారు. ఏపీ, కర్ణాటక, చత్తీస్గడ్ నుంచి కూడా ప్రజలు వచ్చి చికిత్స తీసుకుంటున్నారని వివిధ ప్రాంతాల నుంచి 33 మెడికల్‌ ఎయిర్‌ అంబులెన్సులు హైదరాబాద్‌కు వచ్చాయన్నారు. అందుకే హైదరాబాద్‌ వైద్య చికిత్స కేంద్రంగా మారిందని, కరోనాకు భయపడాల్సిన అవసరమే లేదని "హైదరాబాద్ మెడికల్ ట్రీట్మెంట్‌ - హబ్‌"గా తయారైందని, భరోసా కల్పించ టాన్నికి ప్రయత్నించారు. దీనికి అదనంగా ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు చికిత్స కోసం ఇక్కడికే వస్తున్నారని తెలిపారు. తెలంగాణలో 120 టన్నుల ఆక్సిజన్ రోజూ అవసరమవుతుందని, తాము మాత్రం 400 టన్నుల ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచామని వివరించారు. 


అయితే విజ్ఞులైన తెలంగ్ఫాణా ప్రజలు - వాక్సినేషన్ ఆగిపోయి, ఆస్పత్రుల్లో బెడ్స్ లేక, చికిత్సలు సరిగా అందక,  రోగుల ప్రాణాలు గాలిలో కలసిపొతున్న వేళ ప్రెస్ మీట్ ద్వారా సీయస్ వెలువరించిన విషయాలు యధార్ధం తెలిసీ ప్రభుత్వం సీఎస్ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అని ప్రజలు ఒకవైపు నెటిజన్లు మరోవైపు దుమ్మెత్తి పోస్తున్నారు. మనం ఇంత నీతిమాలిన నాయకులను ఎందుకు ఎన్నుకున్నామా! అంటూ తలలు పట్టుకు కూర్చున్నారు. ప్రభుత్వాన్ని నడిపే అధికార పార్టీ తీరిలా ఉంటే, సోమేష్ కుమార్ ఆధ్వర్యంలోని అధికార యంత్రాంగం చేవ చచ్చి కునారిల్లుతుంది.


మరోవైపు రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఎందుకు పెంచడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. కేవలం రాత్రి కర్ఫ్యూ పెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకున్నదని మండిపడింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ విచారణకు తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరీక్షలు తగ్గించి కేసులు తగ్గాయని ఎలా చెప్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.


అయితే రాష్ట్రంలో కరోనా పరీక్షలు అధిక సంఖ్యలో చేస్తున్నామని “పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‌” న్యాయస్థానానికి తెలపగా, దానికి స్పందనగా హైకోర్టు కనీసం ఒక్క రోజు కూడా లక్ష కరోనా పరీక్షలు దాట లేదని విమర్శించింది. అసలు లాక్‌ డౌన్ దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్‌, ఆక్సిజన్ సదుపాయాలకు సంభంధించిన పూర్తి పూర్తి సమాచారాన్ని తమకు సమర్పించాలని ప్రభుత్వా‍న్ని హైకోర్టు ఆదేసించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: