
ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలో కూడా పలువురు ఆశావాహులు క్యాబినెట్ రేసులో పోటీ పడుతున్నారు...ప్రస్తుతానికి కృష్ణా జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు..కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని...జగన్ క్యాబినెట్ లో ఉన్నారు. అయితే ఈ సారి అందరినీ సైడ్ చేస్తే వీరు పక్కకు తప్పుకోవడం గ్యారెంటీ..కానీ ఎవరినైనా మళ్ళీ కొనసాగించే అవకాశం ఉంటే చెప్పలేం. సరే ఎవరిని ఉంచుతారు, ఎవరిని తీసేస్తారు అనే విషయం పక్కన పెడితే... కృష్ణా జిల్లాలో మాత్రం మిగిలిన ఎమ్మెల్యేలు మంత్రి పదవి దక్కించుకోవాలని గట్టిగానే ట్రై చేస్తున్నారు.
అలా పదవి కోసం ట్రై చేస్తున్న వారిలో పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ముందు వరుసలో ఉన్నారు...ఈయన మొదటే పదవి ఆశించారు..కానీ యాదవ సామాజికవర్గం నుంచి అనిల్ ని క్యాబినెట్ లోకి తీసుకున్నారు. ఇప్పుడు అనిల్ ని సైడ్ చేస్తే తనకే పదవి వస్తుందని సారథి భావిస్తున్నారు. ఇక జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సైతం కాపు కోటాలో పదవి దక్కించుకోవడం చూస్తున్నారు.
ఇటు గౌడ వర్గం నుంచి పదవి కోసం పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ట్రై చేస్తున్నారు. ఇక బ్రాహ్మణ వర్గం నుంచి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ట్రై చేస్తున్నారు. ఇక సీనియర్ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ సైతం మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నారు...ఇలా కృష్ణా జిల్లాలో పలువురు నేతలు క్యాబినెట్ రేసులో ఉన్నారు..మరి వీరిలో ఎవరికి పదవి దక్కుతుందో చూడాలి.