
నిందితులను 2సార్లు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించినా గ్రూప్ 1 ప్రిలిమ్స్ విషయంలో ఐదుగురు పేర్లే బయటికి వచ్చాయని సిట్ అధికారులు చెబుతున్నారట. నిందితులు నోరు విప్పడం లేదా లేకపోతే ఆ గ్రూపు వరకే ప్రశ్నాపత్రాలు పరిమితమయ్యాయా అనే కోణంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోందట. మొత్తం మీద ఏఈ ప్రశ్నాపత్రం మాత్రం 12మందికి చేరినట్లు తేల్చారట. డాక్య, రాజేశ్వర్ నాయక్ కలిసి పలువురికి విక్రయించినట్లు సిట్ దర్యాప్తులో తేలిందట.
ఏఈ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసి పరీక్ష రాసిన నలుగురు అభ్యర్థులను సిట్ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే. మిగతా 8 మంది ఎవరనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారట. గ్రూప్ 1 పరీక్ష రాసి 100కు పైగా మార్కులు సాధించిన 121 మందిలో ఇప్పటికే 84 మందిని సిట్ అధికారులు ప్రశ్నించారట. మిగతా వాళ్ల నుంచి వివరాలు సేకరిస్తున్నారట.
మొత్తం మీద ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న తీరు చూస్తే.. అబ్బే.. టీఎస్పీఎస్సీ నుంచి లీకేజీ అయిన మాట వాస్తవమే కానీ.. ఎక్కువ మందికి వెళ్లలేదని చూపించే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వానికి ఎలాగూ చెడ్డపేరు వచ్చింది.. అయితే.. అది సాధ్యమైనంత తక్కువగా ఉండేలా సిట్ అధికారులు జాగ్రత్తపడుతున్నట్టు కనిపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.