ఎండు ద్రాక్షా ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?ఎండు ద్రాక్షాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మార్కెట్‌లో చాలా రకాల ఎండుద్రాక్షలు ఈజీగా దొరుకుతాయి. ఇక ఎండిన ద్రాక్ష పండ్లనే ఎండుద్రాక్ష అని పిలుస్తారు. ఇవి చాలా తీపిగా కూడా ఉంటాయి. నిజానికి ఇందులో చక్కెర శాతం చాలా ఎక్కువ. వీటిని భారతదేశంలో ఎండుద్రాక్ష ఇంకా ఉల్లర్ ధరాక్షి వంటి అనేక పేర్లతో పిలుస్తారు. భారతదేశంలో ఇది నాసిక్, సాంగ్లీ, జల్నా, షోలాపూర్, సతారా ఇంకా కర్ణాటకలలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. ఇప్పుడు ఎండుద్రాక్ష ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.


1.ఇది జీర్ణక్రియకి సహాయం చేస్తుంది.సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల జీర్ణవ్యవస్థ చాలా దెబ్బతింటుంది. దీనివల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో ఎండుద్రాక్ష వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే మలబద్ధకం సమస్య ఉన్నవారు కూడా వీటిని తినవచ్చు.


2.దీనివల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.బయటి ఆహారంలో కొవ్వు పరిమాణం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిలో బరువు పెరగడం చాలా సర్వసాధారణం. ఎండుద్రాక్ష శరీరంలో కొవ్వు పరిమాణాన్ని ఈజీగా తగ్గిస్తుంది. ఇందులో లభించే సహజ చక్కెర శరీరానికి మంచి శక్తిని ఇస్తుంది.ఇక దీంతో పాటు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.


3. అలాగే రక్తాన్ని పెంచడంలో సహాయపడుతుంది.ఎండు ద్రాక్ష శరీరంలో రక్తాన్ని కూడా పెంచుతుంది.అలాగే రక్తహీనత సమస్య ఉన్నవారు ఎండు ద్రాక్షని ప్రతిరోజు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా మహిళలు కూడా వీటిని కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి.


4. అలాగే ఎముకలని కూడా దృఢంగా చేస్తుంది.ఇంకా కొంతమందికి పాలు తాగడం అంటే ఇష్టం ఉండదు.అలాంటి వారు ఖచ్చితంగా ఎండుద్రాక్షను తింటే చాలా మంచిది. ఇది ఎముకలని బాగా ధృడంగా చేస్తుంది. ఇందులో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ కూడా కనీసం 4 నుంచి 5 ఎండుద్రాక్షలను తినాలి. ఇది శరీరానికి అన్ని విధాల బాగా సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: