టాలీవుడ్ హీరో సుమంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు మహేష్, పవన్ కళ్యాణ్ లకు పోటీ ఇచ్చే పెద్ద స్టార్ హీరో. సినిమాల ఎంపికల వల్ల ఇప్పుడు సుమంత్ వెనకబడ్డాడే కానీ మంచి సినిమాలు చేసుంటే ఈపాటికి సూపర్ స్టార్ మహేష్ బాబు లాగా సూపర్ స్టార్ డమ్ తో దూసుకుపోయేవాడు. సుమంత్ తండ్రి యార్లగడ్డ సురేంద్ర కూడా ఒకప్పుడు స్టార్ ప్రొడ్యూసర్. సుమంత్  మొదటి సినిమా కూడా సార్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ చేతుల మీదుగా తెరకెక్కింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు సుమంత్ కి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో చాలామంది మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లకి సుమంత్ పోటీ ఇస్తాడు అని భావించారు. కానీ అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలో కనుమరుగైపోయాడు. ఒకప్పుడు స్టార్ హీరో స్టేటస్ ని ఎంజాయ్ చేసి ఇప్పుడు సినిమాల్లో కొన్ని కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. సుమంత్ మొదటి సినిమా ప్రేమ కథకు నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ సినిమా హిట్ అవుతుందని అనుకున్నారు కానీ ఊహించని విధంగా అట్టర్ ప్లాప్ అయింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవడానికి ప్రత్యక్ష కారణం రాంగోపాల్ వర్మ అయితే పరోక్ష కారణం టైటానిక్ సినిమా. ఈ విషయాన్ని సుమంత్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చాడు.


 ప్రేమ కథ సినిమా క్లైమాక్స్ లో హీరో హీరోయిన్లు ఇద్దరూ చనిపోతారు. కానీ అది సెట్ అవ్వదని సుమంత్ ముందే చెప్పాడట.కానీ రాంగోపాల్ వర్మ సుమంత్ మాటలు పట్టించుకోకుండా టైటానిక్ సినిమా చూసినప్పుడు నాకు చాలా కన్నీళ్ళు వచ్చాయి. కానీ సినిమాలో హీరోయిన్ ఒక్కతే బ్రతికి ఉండడం నాకు నచ్చలేదు. అందుకే ప్రేమ కథ సినిమా లో ఇద్దరిని చనిపోయినట్టుగా చిత్రీకరిస్తా అని చెప్పారట. కానీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని సుమంత్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. అంతేకాకుండా సుమంత్ తాత అక్కినేని నాగేశ్వరరావు తో, అలాగే మేనమామ నాగార్జున తో కలిసి సినిమా చేసి నా సినీ కెరీర్ ని నాశనం చేసుకున్నానని ఆయనే స్వయంగా చెప్పారు. ఎందుకంటే నాగార్జునతో కలిసి స్నేహమంటే ఇదేరా సినిమాలో నటించారు. కానీ ఈ సినిమాలో వారిద్దరినీ ఫ్రెండ్స్ గా అభిమానులు జీర్ణించుకోలేక పోయారు అని సుమంత్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. అలాగే ఏఎన్నార్ తో కలిసి పెళ్లి సంబంధం అనే సినిమా తీస్తే ఆ సినిమా కూడా అట్టర్ ప్లాఫ్ అయింది. అంతేకాకుండా సుమంత్ తన కెరియర్ లో ఏకంగా 20 హిట్ సినిమాలు వదులుకొని పెద్ద తప్పు చేశాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: