టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. ఇటీవల పూరి జగన్నాథ్, చార్మి ఇద్దరు ముంబైలో కనిపించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే పూరి జగన్నాథ్ అక్కడ ఏం చేస్తున్నాడనేది మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అతి తక్కువ సమయంలోనే సినిమాను తీయగల సామర్థ్యం ఉన్న ఈ డైరెక్టర్ ఉన్నట్టుండి ఎక్కడా కనిపించకపోయేసరికి మరోసారి ఇప్పుడు వార్తల్లోకి ఎక్కాడు. ఇటీవల ఇస్మార్ట్ శంకర్ తో హిట్ ట్రాక్ ఎక్కిన పూరి జగన్నాథ్ మళ్లీ లైగర్ తో కోలుకోలేని దెబ్బతిన్నాడు. అయినా కూడా పూరి జగన్నాథ్ బెదరలేదు. కాకపోతే లైగర్ నష్టాల కారణంగా పంపిణీ ధరల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

ఆర్థిక విభేదాల కారణంగా అతనిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ విషయం కాస్త పక్కన పెడితే.. పూరి జగన్నాథ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఇప్పటివరకు ఎటువంటి వార్తలు రాలేదు. మొదట్లో మెగాస్టార్ కి ఓ స్క్రిప్ట్ వినిపించాడని వార్తలు వచ్చాయి. కానీ దానిపై ఎటువంటి క్లారిటీ రాలేదు. ప్రస్తుతం చిరంజీవి భోలా శంకర్ తర్వాత మరో పర్ఫెక్ట్ మూవీ కోసం డైరెక్టర్స్ వేటలో ఉన్నాడు. ఇప్పటికే మెగాస్టార్ నీ డైరెక్ట్ చేయడం కోసం చాలామంది ఈ డైరెక్టర్స్ లైన్ లో ఉన్నారు. కానీ ఇప్పటివరకు పూరి జగన్నాథ్ పేరు బయటకు రాలేదు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మెగాస్టార్ చిరంజీవి కి ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారం పూరి జగన్నాథ్ సరైన ఎంపిక అని తెలుస్తోంది.

అయితే చిరంజీవి అటు ఇతర డైరెక్టర్లను కూడా అన్వేషిస్తున్నాడు. లైగర్ నష్టాల కారణంగా పూరి జగన్నాథ్ సొంతంగా సినిమాని నిర్మించడం కష్టం. కాబట్టి చిరంజీవి పూరి జగన్నాథ్ కి చాన్స్ ఇస్తాడా? ఇవ్వడ్డా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీన్నిబట్టి చూస్తే పూరీ జగన్నాథ్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నాడని తెలుస్తోంది. తన తదుపరి ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తే గాని పూరి జగన్నాథ్ పై ఇలాంటి వార్తలు ఆగవు. మరోవైపు పూరి జగన్నాథ్ ముంబై లో ఉంది ఓ బాలీవుడ్ మూవీ చేయడం కోసం అని అక్కడ ఒక బాలీవుడ్ హీరో తో ఈ స్మార్ట్ శంకర్ మూవీ ని రీమేక్ చేయబోతున్నట్లు చెప్తున్నారు. కానీ దీనిపై కూడా క్లారిటీ లేదు.మరి పూరి జగన్నాథ్ త్వరలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మెగాస్టార్ తో చేస్తాడా? లేక ఇతర హీరోతో అనౌన్స్ చేస్తాడా? అనేది చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: