పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో మొట్ట మొదటి సారి "బ్రో" అనే సినిమాలో కలిసిన నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ తమిళం లో ప్రేక్షకులను ఎంతగానో అలరించినటు వంటి వినోదయ సీతం అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఈ సినిమా యొక్క తమిళ వర్షన్ కు దర్శకత్వం వహించినటు వంటి సముద్ర కని ఈ తెలుగు రీమేక్ మూవీ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ లో పవన్ కు సంబంధించిన భాగం షూటింగ్ పూర్తి అయింది  ప్రస్తుతం సాయి తేజ్ కు సంబంధించిన షూటింగ్ భాగాన్ని ఈ మూవీ మేకర్స్ పూర్తి చేస్తున్నారు. 

మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే చాలా రోజుల క్రితమే ఈ మూవీ ని జూలై 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ సినిమా బృందం ఈ మూవీ యొక్క ప్రమోషన్ లను అదిరిపోయే రేంజ్ లో నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి అనేక పోస్టర్ లను ఈ మూవీ బృందం విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. తాజాగా బ్రో మూవీ యూనిట్ ఈ సినిమా నుండి మరో పోస్టర్ ను విడుదల చేసింది.

ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి తేజ్ కూడా ఉన్నారు. వీరిద్దరూ కూడా తాజాగా ఈ మూవీ బృందం విడుదల చేసిన పోస్టర్ లో అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్నారు. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇలా ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ లని విడుదల చేస్తూ ఈ మూవీ బృందం ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: