టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమా తరువాత తదుపరి సినిమా ఏంటి అనే చర్చ పతాక స్థాయిలో జరుగుతోంది. ఈయన శివ నిర్వాణ డైరెక్షన్లో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇక అదే సమయంలో సుకుమార్ డైరెక్షన్లో కూడా ఒక సినిమాకు కమిట్ అయ్యాడు. కానీ ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా  కూడా అసలు ఇప్పట్లో పట్టాలు ఎక్కే అవకాశాలు కనిపించడం లేదంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.సుకుమార్ పుష్ప 2 సినిమా తో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరో వైపు శివ నిర్వాణ డైరెక్షన్ లో సినిమా చేసేందుకు విజయ్ దేవరకొండ కాస్త టెన్షన్ పడుతున్నాడు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాని కొంతమంది మాత్రం ఆ సినిమా త్వరలో స్టార్ట్ అవుతుందని.. సమంతసినిమా లో విజయ్ దేవరకొండ కి జంటగా నటించబోతుంది అంటూ ప్రచారం కూడా జరుగుతోంది.ఇక అసలు విషయానికి వస్తే..రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేయబోతున్నాడనే సమాచారం వినిపిస్తుంది. ఈ కొత్త పుకారు సినీ ప్రేమికులకు మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.


వీరిద్దరి కాంబో ఎంతో డిఫరెంట్ గా ఉంటుంది. ఈ ఇద్దరు కూడా విభిన్నమైన ఇమేజ్ ఉన్న వారు. ఇక ఇలాంటి వీరిద్దరూ కలిసి సినిమా చేయడం అంటే ఖచ్చితంగా అదే బ్రహ్మపదార్థం అన్నట్లుగానే ఉంటుంది అంటూ కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఖచ్చితంగా సినిమాకు మంచి క్రేజ్ అయితే లభించే అవకాశం ఉంది.సో వీరిద్దరి సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు ఇంకా అలాగే సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఇప్పటికే త్రివిక్రమ్ సినిమా షురూ చేశాడు. మహేష్ బాబు షూటింగ్ లో అయితే జాయిన్ కాలేదు కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడట.ఇక సర్కారు వారి పాట సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు జాయిన్ అవుతాను అంటూ చెప్పుకొచ్చాడు.కాబట్టి త్రివిక్రమ్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న సినిమా ఈ సంవత్సరం చివరి వరకు పట్టే ఛాన్స్ ఉంది. అంటే రౌడీ స్టార్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేయాలంటే ఈ ఏడాది చివరి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: