ఈరోజు భారీ అంచనాల నడుమ తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన చిత్రం `కుబేర`. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ధనుష్‌, నాగార్జున మెయిన్ లీడ్‌గా యాక్ట్‌ చేశారు. రష్మిక మంద‌న్న‌, జిమ్ సర్భ్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించగా.. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఆల్రెడీ కుబేర ప్రీమియర్ షోలు యూఎస్ లో ప్రారంభం అయ్యాయి. సినిమా చూసిన ఆడియన్స్ ఎక్స్ వేదికగా త‌మ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.


మెజారిటీ ఆడియెన్స్ నుంచి కుబేర‌కు పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది. ధ‌నుష్ అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడ‌ని, నాగార్జున అథెంటిక్ రోల్‌లో అద‌ర‌గొట్టార‌ని సినీ ప్రియులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అలాగే శేఖర్ కమ్ముల రచన మ‌రియు దర్శకత్వం, డీఎస్పీ అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉన్నాయ‌ని చెబుతున్నారు. శేఖర్ కమ్ముల కథ చెప్పే విధానం ఆకర్షణీయంగా ఉందంటున్నారు.


ర‌ష్మిక త‌న కెరీర్‌లోనే గుర్తుండిపోయే పాత్ర‌లో న‌టించింద‌ని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అదే విధంగా సెకండ్ హాఫ్ లో వ‌చ్చే భావోద్వేగ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుడి హృద‌యాన్ని తాకుతాయ‌ని.. సినిమాను క‌చ్చితంగా చూడ‌మంటూ రిక‌మండ్ చేస్తున్నారు. అయితే ప్ర‌తి సినిమా మాదిరిగానే కుబేర కూడా కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. ముఖ్యంగా కథనం వేగం కొంచెం సాగదీసినట్లు అనిపించిందని.. 2 గంటల్లో చెప్పగలిగే కథను 3 గంటలకు లాగారని మూవీ ల‌వ‌ర్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఫస్ట్ హాఫ్ లో సాగ‌దీత స‌న్నివేశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తాయ‌ని చెబుతున్నారు. మొత్తంగా ప‌బ్లిక్ టాక్ చూస్తుంటే కుబేర హిట్ అయ్యే ఛాన్సులే ఎక్కువ‌గా క‌నిపిస్తాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: