సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలు రావడానికి ఫ్యాన్స్ ఎంత ఈహర్ గా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు . అలాంటి ఒక క్రేజీ కాంబో నే అల్లు అర్జున్ - సందీప్ రెడ్డి వంగ . అల్లు అర్జున్ పాన్  ఇండియా హీరో సందీప్ రెడ్డివంగా టాలెంట్ ఉన్న డైరెక్టర్ . ఉన్నది ఉన్నట్లు తెరకెక్కిస్తాడు. ఇద్దరి కాంబో లో  ఒక్కటంటే ఒక్క సినిమా పడ్డా అది చాలు . అది బాక్స్ ఆఫీస్ చరిత్రను తిరగరాసేస్తుంది. అయితే వీళ్ళ కాంబోలో సినిమా వస్తుందిలే అని ఆనందపడే లోపే మొత్తం తుడిచిపెట్టుకుపోయింది .


సోషల్ మీడియాలో ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది.  సందీప్ రెడ్డికి అల్లు అర్జున్ కి  అస్సలు పడడం లేదు అని దానికి కారణం ఒక హీరోయిన్ అని తెగ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.  ఆ కారణంగానే సందీప్ రెడ్డి వంగ - అల్లు అర్జున్ కోసం అనుకున్న కధను  వేరే వాళ్ళకి వెళ్లిపోయినట్లు ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి . సందీప్ రెడ్డి :స్పిరిట్"అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు . ఈ సినిమాలో హీరోయిన్గా దీపికా పదుకొనే నీ అనుకున్నాడు . కానీ దీపిక ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసింది . దానికి తోడు గొంతెమ్మ కోర్కెలు కోరింది.



తిక్క రేగిన సందీప్ రెడ్డి ఆమెని  సినిమా నుంచి తీసేసారు . అయితే సందీప్ - దీపికాను తీసేసిన వెంటనే సోషల్ మీడియా వేదికగా పరోక్షకం ఘాటు పోస్ట్ పెట్టారు . ఈ ఒక్క పోస్ట్ తో అందరికి అర్థం అయిపోయింది దీపికా పదుకొనే క్యారెక్టర్ ఏంటి..? దీపిక పదుకొనే డబ్బు కోసం ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ..? అయితే వెంటనే ఒక రెండు మూడు రోజులకే ఆమెను అల్లు అర్జున్ తన సినిమాలో హీరోయిన్గా పెట్టుకున్నాడు.  అట్లీ ఇది అఫీషియల్ గా ప్రకటించాడు .



అప్పటినుంచి వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అంటున్నారు సినీ వర్గాలు . - అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగ మధ్య తెలియని సైలెంట్ వార్ నడుస్తుంది అని .. వీళ్లు ఎడ ముఖం -  పెడ ముఖంలా ఉన్నారని . దీన్నంతటికి కారణం దీపికా పదుకొనేనని మండిపడుతున్నారు . దీపికా కారణంగానే మంచి కాంబో మిస్ అయిపోయింది అని సందీప్ రెడ్డి - అల్లు అర్జున్ కాంబోలో అస్సలు సినిమా వస్తుందా..? రాదా..?  అని కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు . ఈ గొడవలు ఎప్పటికి సర్దుకుంటాయో అని ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.  ఆల్రెడీ మెగా ఫ్యామిలీతో గొడవలు .. మెగా ఫాన్స్ మొత్తం యాటీ అయిపోయారు.  ఇప్పుడు సందీప్ రెడ్డివంగా కూడానా అంటూ జనాలు ఘాటుఘాటుగా మాట్లాడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: