
పైగా హరిష్ శంకర్ దర్శకత్వం కాబట్టి ఈ సినిమా గురించి ఇంకా పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అభిమానులు . గతంలో గబ్బర్ సింగ్ సినిమా టైంలో ఎలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ హరిష్ శంకర్ - పవన్ కళ్యాణ్ పై రాసారు అనేది అందరికీ తెలిసిందే . ఆ డైలాగ్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. "నేను ట్రెండ్ ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తాను" అన్న డైలాగ్ మరింత హైలెట్ గా మారింది. కాగా ప్రెసెంట్ సెట్స్ పై ఉన్న ఈ సినిమా షూట్ నుంచి ఒక క్రేజీ వీడియో లీక్ అయింది . అంతేకాదు గతంలో సోషల్ మీడియాలో శ్రీ లీల - పవన్ కళ్యాణ్ ఈ సినిమా నటిస్తున్న వీడియోస్ కూడా కొన్ని లీక్ అయి సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాయి.
ఇప్పుడు తాజాగా షూటింగ్లో పవన్ కళ్యాణ్ - శ్రీలీల ఉన్న ఒక వీడియో లీక్ అయి వైరల్ గా మారింది . శ్రీలీల - పవన్ పై ఆన్ సెట్స్ లో ఉన్న ఓ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఇది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఓ రేంజ్ లో ఎగ్జైట్ అయిపోతున్నారు . తమకి గబ్బర్ సింగ్ చూసిన ఫీలింగ్ మళ్లీ ‘ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాతో మళ్లీ తీసుకునిరాబోతున్నాడు అని హరిష్ శంకర్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని ఈ సినిమాలో ఫుల్ ఆటిట్యూడ్ తో చూడబోతున్నాం అంటూ లీకైన పిక్స్ వీడియోస్ ఆధారంగా తెలిసిపోతుంది . కానీ ఈ లీక్స్ మాత్రం మేకర్స్ కి తలనొప్పిగా మారిపోయాయి . ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీ లీల క్యారెక్టర్ చాలా హైలెట్ గా ఉండబోతుంది అంటూ కూడా తెలుస్తుంది. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించిన ఈ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది..!!