జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీఎం కావాలని అభిమానుల ఆకాంక్ష అనే సంగతి తెలిసిందే.   పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకాంక్ష నెరవేరనుందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంలో పవన్ పాత్ర ఎంతో  ఉంది.  పవన్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ ఈ పదవితో అభిమానులు మాత్రం పూర్తిస్థాయిలో సంతృప్తితో అయితే లేరనే చెప్పాలి.

పవన్ పాల్గొనే  సభలలో చాలా సందర్భాల్లో అభిమానులు సీఎం సీఎం అంటూ కేకలు వేయడం సోషల్ మీడియా వేదికగా  హాట్ టాపిక్ అయింది.   రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు రెండున్నర సంవత్సరాలు  పవన్ కళ్యాణ్ రెండున్నర సంవత్సరాలు సీఎంగా పని చేయాలనే  ప్రతిపాదనలు సైతం పలు సందర్భాల్లో వ్యక్తమయ్యాయి.  అయితే పవన్ నాలుగు రోజుల పాటు ముఖ్యమంత్రిగా పని చేయనున్నారని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

చంద్రబాబు నాయుడు ఈ నెల చివరి వారంలో సింగపూర్ లో పర్యటించనున్న నేపథ్యంలో ఆ సమయంలో పవన్  బాధ్యతలు స్వీకరించనున్నారని సమాచారం అందుతోంది.  చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్, టీజీ భరత్, నారాయణ వెళ్లనున్నారని సమాచారం అందుతోంది.  ఈ విషయం గురించి అధికారికంగా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది.

శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఒకే ఒక్కడు  సినిమాలో అర్జున్ ఒక్కరోజు సీఎంగా పని చేసిన సంగతి తెలిసిందే. పవన్ సైతం నాలుగు రోజులు  ముఖ్యమంత్రిగా పని చేసినా పాలనలో తన మార్కును  చూపించడం  పక్కా అని చెప్పవచ్చు.  మరోవైపు పవన్ కొత్త సినిమాలకు  సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని  హీరోగా పవన్ కెరీర్ ను కొనసాగించనున్నారని తెలుస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: