ఏపీలో రాజకీయ పరిస్థితులు మీడియాలో కనబడుతున్నట్లు లేవని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వ పనులు ఆర్భాటాలకు తప్ప ప్రజల శ్రేయస్సును కాపాడటం కోసం ఏ మాత్రం పనికి రావటం లేదని చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నట్లు ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా వైయస్ జగన్ కరోనా కష్టా కాలంలో వెయ్యికి పైగా కొత్త అంబులెన్సులను తీసుకు వచ్చి విజయవాడ నడి రోడ్డులో భారీ స్థాయిలో డ్రోన్ కెమెరా లతో విజువల్స్ తీసి ఎలక్ట్రానిక్ మీడియాలో అదేరీతిలో సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం చేసుకున్నారు. 
IHG
ఇక వాస్తవ పరిస్థితి కి వచ్చేసరికి కరోనా కారణంగా రాష్ట్రంలో మరణాలు సంభవిస్తున్నాయి అంబులెన్సులు కనబడటం లేదని ప్రతిపక్షాల నాయకులు అంటున్నారు. ఇటువంటి ఆపత్కాల సమయములో కొత్త ఆంబులెన్స్ లు రాష్ట్రంలో కనపడకుండా ఎక్కడ ఉన్నాయి అని విపక్షాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల పదుల సంఖ్యలో కరోనా అనుమానితులు ఉన్న వారిని ఒకే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో కూడా సరిపోని అంత మంది జనన్నీ ఒకే బస్సులో క్వారంటైన్ కి తరలించారు. 
IHG
కాగా పదుల సంఖ్యలో కరోనా అనుమానితులు ప్రయాణం చేస్తున్న ఈ ఆర్టీసీ బస్సు వీడియో బయటకు వచ్చింది. అంత మంది జనం ఒక్క బస్సులో వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అని ప్రతిపక్షాలతో పాటు నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి జగన్ అందుబాటులోకి తెచ్చిన కొత్త అంబులెన్స్ లు ఏమయ్యాయి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఆ బస్సులో వైసిపి పార్టీకి చెందిన మద్దతుదారులు కూడా ఆ బస్సులో ఉండటంతో పార్టీ తరఫున కూడా ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: