తెలుగుదేశం పార్టీలో ఆందోళన కలవరం అంతరాంతరాల్లోనే జనించినట్లుగా ఉంది. స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాల శ‌రాఘాతం త‌గిలి షాక్ నుండి టీడీపీ ఇప్పట్లో తేరుకోలేదనే చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు సిఐడి అందించిన నోటీసులు ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించాయి. రాజధాని అమ‌రావ‌తి అక్రమాల పుట్ట, వేలాది ఎకరాలే కాదు వేల కోట్ల భూకుంభకోణం అనే అభిప్రాయాలు ప్ర‌జ‌ల్లో ఉన్నాయి.


టిడిపి అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు కేవ‌లం త‌న, తన కుటుంబ, తన బంధువుల, తన స్నేహితుల మరియు త‌న సామాజికవర్గ ప్రజల స్థిరాస్థి ప్ర‌యోజ‌నాల కోస‌మే అమ‌రావ‌తికి రాజధాని ప్రతిపత్తి క‌ల్పించార‌నేది ప్ర‌జల అంతరాంతాల్లో ఉన్న నిశ్చితాభిప్రాయం. అమ‌రావ‌తి పేరుతో ఎంత భావావెశాలను రగిల్చారు. చివరికి గుంటూరు, విజ‌య‌వాడ ప్ర‌జ‌లు కూడా దానికి ప్రాముఖ్యం ఇవ్వలేదని - స్థానికఎన్నిక‌ల‌లో టిడిపి ధారుణ ఓటమితో పూర్తిగా స్పష్టమైంది. అమ‌రావ‌తి ఇంటే కొందరి భ్రమల్లో కలల్లో మిగిలిఉంది. చంద్ర‌బాబు నాయుడు ఆయన పార్టి దాని సంబంధిత వ్యక్తుల వ్యవస్థల అక్ర‌మాల చిరునామాగా చరిత్రలో నిలిచిపోతుంది.


అమరావతి భూముల విషయములో చంద్ర‌బాబు నాయుడు సీఐడీ నుంచి నోటీసులు తీసుకున్నట్లు ధృవీకరించారు. ఈ నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ఆయన దృష్టి పెట్టారు. ఈ క్రమంలో న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. చంద్రబాబు సీఐడీ నోటీసులు అందుకున్న వెంటనే న్యాయ నిపుణులు ఆయన ఇంటికి చేరుకున్నారు. సీఐడీ నోటీసులు అందుకున్నందున కోర్టుకు వెళ్లాలా? లేక విచారణకు హాజరు కావాలా? అనే అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.


సీఐడీ నోటీసులు ఇచ్చిన ప్రకారం చంద్రబాబు తప్పనిసరిగా విచారణకు హాజర వ్వాలని న్యాయనిపుణులు చెప్తున్నారు. హాజరుకాని పక్షంలో ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశముందని అభిప్రాయ పడుతున్నారు. ఐపీసీ సెక్షన్లు 120 బీ, 166, 167, 217, ప్రొహిబిషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ అలినేషన్ యాక్ట్ 1977, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు అయ్యాయి.


ఈ సంధర్భంగా సిబిఎన్ & కో - వెంట‌నే న్యాయ‌ నిపుణుల‌తో సంప్రదింపులు చ‌ర్చ‌లు మొదలెట్టినట్లు పలు మీడియాలలో వార్తా క‌థ‌నాలు శరపరంపరలా వ‌స్తున్నాయి.తానెప్పుడు తప్పు చేయనప్పుడు తను నిప్పు అని ఆయనే పలుమార్లు చెప్పినప్పుడు, అలా ఏ అక్ర‌మాలూ జ‌ర‌గ‌న‌ప్పుడు, సిఐడి విచార‌ణ‌కు హాజ‌రై త‌న నిర్ధోషిత్వాన్ని వివరించవచ్చు కాదా! అంటే వెగంగా కదిలి న్యాయ‌ నిపుణుల‌తో చర్చించి తన నేరాల నుండి త‌ప్పించుకునే మార్గాల గురించి అన్వేషిస్తున్న‌ దాఖలాలు కనిపిస్తున్నాయి. అస‌లు విచార‌ణ‌కు హాజ‌రు కాకుండా ఉండ‌టానికే  నారా చంద్ర‌బాబు నాయుడు తన వ్యూహాలను రచిస్తున్నారా? అనే అనేక సందేహాలు ప్రజల నుండి వినిపిస్తున్నాయి.


ఇక తెలుగుదేశం చోట మోటా నేత‌లు,  నాయుడు బాబు భ‌క్త పరమాణువులైన వ‌ర్ల రామ‌య్య‌, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌నరెడ్డి,  టీడీపీ ఏపీ శాఖ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు మొదలైనవాళ్ళు స్పందించారు. ఈ విషయంపై వ‌ర్ల‌ రామయ్య,  అచ్చెన్నాయుడు స్పందించిన తీరు గ‌మ‌నిస్తే, సిఐడి ఇన్నాళ్లూ ఎందుకు ఆలస్యం చేసిందన్నట్టుగా ప్రవర్తించారు.  2015 లో జ‌రిగిన అమరావతి “ల్యాండ్-పూలింగ్” గురించి నోటీసులు ఇస్తారా? అంటూ వాళ్ళు  ప్ర‌శ్నించారు. వీళ్ల ప్ర‌శ్న తీరును చూస్తుంటే, ఇన్నాళ్లూ ఎందుకు ఆలస్యం  చేశారన్న‌ట్టుగా ప్రవర్తించారు. వైసిపి అధికారంలోకి రాగానే నారా చంద్ర‌బాబు నాయుడును అరెస్టు చేయాల్సింది ఉండగా అలా ఎందుకు ఇంతవరకు జరగలెదని బాధ పడుతున్నట్లుంది.


ఇక ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు అన్యాయ‌మ‌ని వీరు వాదిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల భూముల‌ను బెదిరించి తీసుకు న్న‌ప్పుడు ఆ కేసులు కాక మ‌రే కేసులు పెడ‌తారో? తెలుగుదేశం నేత‌లే చెప్పాలని వైసిపి అంటుంది. చూడ‌బోతే  నారా చంద్ర‌బాబు నాయుడుపై ఏ ఏ సెక్ష‌న్ల కింద కేసులు పెట్టాలో? ఏ ఏ సెక్ష‌న్ల కింద పెట్ట‌కూడ‌దో? తెలుగు త‌మ్ముళ్లే నిర్ణయించేలా ఉన్నారు. మొత్తానికి చంద్ర‌బాబుకు , సిఐడి నోటీసుల‌తో తెలుగు దేశం పార్టి ఒక కుదుపుకు గురైనట్లు స్ప‌ష్టమైంది.


ఐతే న్యాయ నిపుణులతో చర్చ సందర్భం గా కోర్టు నుంచి స్టే తెచ్చు కోవాలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఎలా ముందు కెళ్లాలనే చర్చ కూడా వచ్చినట్లు సమాచారం. పైగా విచారణకు విజయవాడ వస్తే ఉద్రిక్త  పరిస్థితులు నెలకొనే అవకాశదని అనటం తో చంద్రబాబు కూడా స్టే తెచ్చుకోవడానికి మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో వచ్చిన ఇన్ సైడర్ ట్రైడింగ్ కేసు కాకుండా.. కొత్తగా కేసు నమోదు చేశారు. ముఖ్యంగా అసెన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబుపై కేసులు నమోదయ్యాయి. చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ అయ్యాయి. వీళ్లిద్దరితో పాటు అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ గా ఉన్న కాంతిలాల్ దండేకు నోటీసులు ఇచ్చారు. భూ రికార్డులపై ఆయన్ను కూడా విచారించే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: