తెలంగాణా మంత్రి శ్రీనివాసగౌడ్ పూర్తిగా ఇరుక్కున్నట్లే ఉన్నారు. వెబ్ సైట్ ట్యాంపరింగ్ ఆరోపణలు దాదాపు నిరూపణ అయినట్లే ఉంది. వెబ్ సైట్ ట్యాంపరింగ్ అంటే ఏదో మామూలు వెట్ సైట్ అనుకునేరు. ఏకంగా కేంద్ర ఎన్నికల కమీషన్ వెబ్ సైట్ నే గౌడ్ ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసిన ఎన్నికల కమీషనర్ వెట్ సైట్ ట్యాంపరింగ్ జరిగిందని ధృవీకరిస్తు నివేదికను ఢిల్లీకి పంపారట. కేంద్ర ఎన్నికల కమీషన్ లోని టెక్నికల్ బృందం కూడా దర్యాప్తు చేసిందట. ట్యాంపరింగ్ నిజమే అని నిర్ధారణ చేసిందని సమాచారం.




ఇంతకీ విషయం ఏమిటంటే 2018 ఎన్నికల్లో మహబూబ్ నగర్ అసెంబ్లీ నుండి పోటీచేసి గెలిచారు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన గౌడ్ మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీచేసి గెలిచారు. వెంటనే మంత్రికూడా అయిపోయారు. విషయం ఏమిటంటే ఎన్నికల్లో పోటీచేసే సమయంలో గౌడ్ అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో అప్పులు, ఆస్తులు, క్రిమినల్ కేసుల వివరాలు ఉన్నాయట. గౌడ్ సబ్మిట్ చేసిన అఫిడవిట్ నే ఎన్నికల కమీషన్ తన వెబ్ సైట్లో పెట్టింది.




అయితే పోలింగ్ పూర్తయి ఫలితాలు రావటానికి రెండు రోజుల ముందు సదరు అఫిడవిట్ మాయమైపోయింది. పాత అఫిడవిట్ మాయమైపోవటమే కాకుండా దాని ప్లేసులో కొత్త అఫిడవిట్ ప్రత్యక్షమైందట. ఈ విషయాన్ని ఆయన ప్రత్యర్ధులు ఇట్టే పట్టేసుకున్నారు.  వెంటనే ఎన్నికల కమీషనర్తో పాటు కేంద్ర ఎన్నికల కమీషన్ కు కూడా ఫిర్యాదు చేశారట. మొదట్లో గౌడ్ దాఖలు చేసిన అఫిడవిట్ తో పాటు కొత్త అఫిడవిట్ ను కూడా ప్రత్యర్ధులు తమ ఫిర్యాదుతో జతచేశారట.




ఇంకేముందు రెండు అఫిడవిట్లోను తేదీలతో సహా అఫిడవిట్లలో కూడా స్పష్టంగా తేడా కనబడింది.  అదే విషయాన్ని ఎన్నికల కమీషనర్ తన దర్యాప్తులో నిర్ధారించారట. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన కారణంగానే తనపై అనర్హత వేటు పడుతుందన్న భయంతోనే ఏకంగా కేంద్ర ఎన్నికల కమీషన్ వెబ్ సైట్ నే శ్రీనివాస గౌడ్ ట్యాంపర్ చేశారనే ఆరోపణలకు ఆధారాలు కూడా దొరికిపోయాయి. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల కమీషన్ లోని టెక్నికల్ నిపుణులు కూడా దాదాపు నిర్ధారించినట్లు సమాచారం.




అధికారికంగా నివేదిక గనుక వచ్చేస్తే గౌడ్ పై ఐపీసీతో పాటు ఐటి యాక్ట్ ప్రకారం కూడా చాలా సెక్షన్ల క్రింద కేసులు నమోదవ్వటం ఖాయమంటున్నారు.  కేంద్ర ఎన్నికల కమీషన్ వెబ్ సైట్ ట్యాంపరింగ్ అంటే క్రిమినల్ కేసవ్వటం ఖాయమనే నిపుణులు చెబుతున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: