చాలా మంది బిజీ లైఫ్ నుంచి బయటకు రావడానికి వీకెండ్ లేదా ఆఫీస్ ముగిసిన తర్వాత అలా ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్ కో లేదా ఏదైనా కెఫ్ లకు వెళతారు. అయితే అలాంటి సమయంలో ఏదైనా ఊహించని ఘటనలు జరిగితే ఇక అంతే సంతోషం మొత్తం నీరు కారి పోతుంది.అయితే ఈ మధ్య ప్రముఖ ఫుడ్ కోర్టు లలో ఊహించని విధంగా ఎదురవుతున్నాయి. ఆర్డర్ చేసిన ఫుడ్ లలో ఏదొకటి రావడం జరుగుతుంది.మొన్నీమధ్య పాము చర్మం వచ్చింది.తాజాగా ఓ ప్రముఖ ఫుడ్ సెంటర్ ఆర్డర్ చేసిన కూల్ డ్రింక్ లో ఏకంగా బల్లి పడి రావడం చూసిన కస్టమర్ షాక్ కు గురైయ్యాడు.


అది చూసిన అతను కోపంతో రగిలి పోయాడు.ఇక ఏం చేయాలో అర్థం కాక అక్కడ వీరంగం సృష్టించాడు. అది చూసిన జనం కూడా అతనికి సపోర్ట్ గా నిలిచారు.దాంతో కాసేపు అక్కడ రణరంగం జరిగింది.వివరాల్లొకి వెళితే..అహ్మదాబాద్‌కు చెందిన భార్గవ జోషికి ఎదురైంది. భార్గవ జోషి తన స్నేహితుడితో కలిసి అహ్మదాబాద్‌లోని మెక్‌ డొనాల్డ్స్‌ రెస్టారెంట్‌ వెళ్లాడు.. తాగడానికి కోక్‌ ఆర్డర్‌ ఇచ్చాడు.. అయితే.. ఓ టేబుల్‌ దగ్గర కూర్చొని కోక్‌ను ఆస్వాదిద్దామనుకునే సరికి.. కోక్‌లో చనిపోయిన బల్లి దర్శనమిచ్చింది.అది చొసి ఖంగుతిన్న భార్గవ సంబంధిత సిబ్బందికి ఈ విషయాన్ని తెలియజేశాడు. వారు.. మెక్‌డొనాల్డ్స్‌ అవుట్‌ లెట్‌ మేనేజర్‌ దృష్టికి ఈ విషయాని తీసుకెళ్లడంతో.. అతను చాలా సింపుల్‌గా.. ఆ విషయానికి అంత ప్రాధాన్యం ఇవ్వలేదని భార్గవ ఆరోపించాడు. అంతేకాదు, కూల్ డ్రింకుకు చెల్లించిన డబ్బును తిరిగి ఇస్తామని చెప్పాడని వెల్లడించాడు. దీంతో చిరెత్తిన భార్గవ్‌ వెంటనే సోషల్ మీడియా ద్వారా ఆ దృశ్యం వీడియో ను పోస్ట్ చేశాడు.మున్సిపల్‌, పోలీసులతో పాటు.. మెక్‌ డొనాల్డ్స్ పై అధికారులకు ట్యాగ్‌ చేశాడు.. కాగా, కూల్ డ్రింకులో బల్లి పడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో అహ్మదాబాద్ పురపాలక శాఖ స్పందించింది. మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్ లో తనిఖీలు చేపట్టింది. ఆపై రెస్టారెంటును మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.మొత్తానికి అతనికి అధికారులు న్యాయం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: