అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ ఎందుకంటే వాటిని రుచి చూడటము జరుగుతుంది. అలాగే అందులో నుండి గుణపాఠాలు నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి చేసిన తప్పులను మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడతాము. కొత్త మార్గాలను నిర్మించుకుని పొరపాట్లను సరిచేసుకుంటూ ముందుకు సాగడానికి సహాయపడుతుంది. "ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ" అంటుంటారు పెద్దలు. ఎందుకంటే సలహాలు, సూచనలు ఇవ్వడం సులభమే. కానీ వాటిని ఆచరించడం కష్టం. అందుకే ఉచిత సలహాలు ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ రెండు పొరపాటే. మనం చెప్పే మాటలు, సలహాలు ముందుగా మనం ఆచరిస్తూ ఉండాలి.

అందులోనూ ఉపయోగపడేవి అయి ఉండాలి. అప్పుడే ఆ సలహాలకు మరియు మాటలకు ఒక విలువ ఉంటుంది. అదే విధంగా మన ఎదుగుదలకు ఉపయోగపడేవిగా ఉంటాయి. అందుకే అంటుంటారు ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువగా లభిస్తుందని, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఏ పనైనా లేదా లక్ష్యమైనా కేవలం చేయాలనే, సాధించాలనే ఉద్దేశం ఉంటే సరిపోదు. ఆ లక్ష్యాన్ని సాధించి విజయ పధంలో నడవడానికి సరైన ప్రణాలిక అవసరం. మీరు పయనించే మార్గంలో కష్టాలు ఎదురైనా ఇష్టంగా ఎదుర్కోవాలి, పట్టుదలతో సాధించి తీరాలి. ఎదుటి వారి బాగును కోరుకుంటే నీవు కూడా బాగుంటావు.

స్వార్థంతో మనిషి పూర్తిగా కలుషితమై పోతున్న రోజులివి. కానీ ఈ పరిస్థితుల నుండి బయట పడే అవకాశం కూడా మన చేతిలోనే ఉంది. విజయాన్ని అందుకోవాలని అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఇంకెవ్వరూ సక్సెస్ కాకూడదని, మన ముందు ఎప్పటికీ తక్కువ గానే ఉండాలని కోరుకోవడం తప్పు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి.   ఇతరుల విజయంలో మన ఆనందాన్ని వెతుక్కోవాలి. అప్పుడే మనకు సక్సెస్ దక్కుతుంది. అంతే కానీ వారి సక్సెస్ పట్ల అసూయగా ఉంటే చిన్న చిన్న ఆనందాలను కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది.  కాబట్టి చేసిన తప్పులు లేదా పొరపాట్ల నుండి తెలుసుకుని విజయానికి బాటలు వేసుకోండి.



మరింత సమాచారం తెలుసుకోండి: